‘జీవితంలో ఇంతలా భయపడే రోజు వస్తుందనుకోలేదు’ | Never Been So Afraid: Jamieson Breaks Silence On Vaibhav Sooryavanshi | Sakshi
Sakshi News home page

‘జీవితంలో ఇంతలా భయపడే రోజు వస్తుందనుకోలేదు’

May 2 2026 2:43 PM | Updated on May 2 2026 2:52 PM

Never Been So Afraid: Jamieson Breaks Silence On Vaibhav Sooryavanshi

PC: BCCI/IPL

న్యూజిలాండ్‌ స్టార్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ పేసర్‌ కైలీ జెమీసన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన జీవితంలో పదిహేనేళ్ల పిల్లాడికి కూడా భయపడాల్సిన రోజు వస్తుందని అస్సలు ఊహించలేదన్నాడు. అతడిని అవుట్‌ చేసేందుకు ఆసీస్‌ దిగ్గజ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌తో చర్చించాల్సి వచ్చిందని పేర్కొన్నాడు.

36 బంతుల్లోనే శతక్కొట్టాడు
అవును.. జెమీసన్‌ చెప్తున్నది రాజస్తాన్‌ రాయల్స్‌ చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) గురించే!.. ఐపీఎల్‌-2026లో ఈ లెఫ్లాండర్‌ బ్యాటర్‌ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటికే ఈ సీజన్‌లో తన ఫాస్టెస్ట్‌ సెంచరీ నమోదు చేశాడు వైభవ్‌. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో 36 బంతుల్లోనే శతక్కొట్టాడు.

ఎదురుగా ఎవరున్నా డోంట్‌ కేర్‌
ఇక ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా ప్రపంచస్థాయి బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌లోనూ సిక్సర్లు బాది తన బ్యాట్‌ పవరేంటో మరోసారి చాటిచెప్పాడు వైభవ్‌. ఎదురుగా ఎంతటి దిగ్గజ బౌలర్‌ ఉన్నా బంతిని బాదడమే లక్ష్యంగా పెట్టుకుని పరుగులు పిండుకుంటున్నాడు.

నేనూ భయపడ్డా
ఈ నేపథ్యంలో తాను సైతం వైభవ్‌ సూర్యవంశీ విషయంలో భయపడ్డాడని కివీస్‌ స్టార్‌, ఢిల్లీ పేసర్‌ కైలీ జెమీసన్‌ అన్నాడు. కాగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఢిల్లీ రాజస్తాన్‌తో తలపడ్డ సంగతి తెలిసిందే. జైపూర్‌ వేదికగా టాస్‌ గెలిచిన రాజస్తాన్‌.. తొలుత బ్యాటింగ్‌ చేసింది.

అయితే, ప్రతీ మ్యాచ్‌లోనూ అదరగొడుతున్న ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (6), వైభవ్‌ సూర్యవంశీ (4)లను త్వరగానే వెనక్కి పంపడంలో ఢిల్లీ సఫలమైంది. వైభవ్‌ను జెమీసన్‌ బౌల్డ్‌ చేయగా.. జైసూను మిచెల్‌ స్టార్క్‌ పెవిలియన్‌కు పంపాడు.

ఢిల్లీ గెలుపు
ఓపెనర్లు విఫలమైనా రాజస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 225 పరుగుల మేర మంచి స్కోరు సాధించింది. ధ్రువ్‌ జురెల్‌ (42), డొనోవాన్‌ ఫెరీరా (14 బంతుల్లో 47 నాటౌట్‌)లతో పాటు కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ (50 బంతుల్లో 90) ఇన్నింగ్స్‌ ఇందుకు కారణం.

అయితే, 226 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ అనూహ్య రీతిలో ఊదిపారేసింది. ఓపెనర్లు పాతుమ్‌ నిస్సాంక (33 బంతుల్లో 62), కేఎల్‌ రాహుల్‌ (40 బంతుల్లో 75).. వన్‌డౌన్‌ బ్యాటర్‌ నితీశ్‌ రాణా (17 బంతుల్లో 33) వేగంగా ఆడి పని పూర్తి చేశారు.

ఇంతలా భయపడే రోజు వస్తుందనుకోలేదు
ఇదిలా ఉంటే.. వైభవ్‌ సూర్యవంశీని త్వరగా పెవిలియన్‌కు పంపేలా తాను ముందు నుంచే సన్నద్ధమయ్యాయని జెమీసన్‌ తాజాగా వెల్లడించాడు. ‘‘పదిహేనేళ్ల పిల్లాడికి కూడా ఇంతలా భయపడే రోజు వస్తుందని నా జీవితంలో ఎప్పుడూ అనుకోలేదు.

అతడిని అవుట్‌ చేసేందుకు మేము ఎన్నో వ్యూహాలు, ప్రణాళికలు రచించుకున్నాము. అందుకు తగ్గ ఫలితం వచ్చింది’’ అని జెమీసన్‌ చెప్పుకొచ్చాడు. రాజస్తాన్‌కు కీలకమైన ఓపెనింగ్‌ జోడీని విడదీసేందుకు తానూ, స్టార్క్‌ ప్లాన్‌ వేశామని.. అనుకున్నట్లే ఆరంభంలోనే వారిని వెనక్కి పంపామని హర్షం వ్యక్తం చేశాడు.

కాగా 15 ఏళ్ల వైభవ్‌ను అవుట్‌ చేసిన తర్వాత.. 31 ఏళ్ల జెమీసన్‌ వైల్డ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నాడు. అతడి ముఖంలో ముఖం పెట్టి గట్టిగా అరుస్తూ చప్పట్లు కొట్టాడు. దీంతో బీసీసీఐ జెమీసన్‌ను మందలించడంతో పాటు అతడి ఖాతాలో ఓ డిమెరిట్‌ పాయింట్‌ జతచేసింది. 

చదవండి: Heinrich Klaasen: 'క్షమించండి.. అది సాధ్యం కాదు'

Advertisement
 
Advertisement
Advertisement