
Sandeep Lamichhane: నేపాల్ క్రికెట్ అసోసియేషన్ తమ ఆటగాడు సందీప్ లమిచానేకు భారీ ఊరట కలిగించింది. అతడిపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రానున్న నేపాల్ క్రికెట్ వరల్డ్‌కప్ లీగ్ 2 ట్రై సిరీస్‌లో ఆడేందుకు లమిచానేకు మార్గం సుగమమైంది. ఈ విషయాన్ని నేపాల్ క్రికెట్ అసోసియేషన్ జనరల్ మేనేజర్ బ్రిటాంట్ ఖనాల్ ధ్రువీకరించాడు.
అత్యాచార ఆరోపణలతో అరెస్టు
ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడిన ఖనాల్.. కోర్టు షరతులకు లోబడే ప్రస్తుతం అతడిని స్వదేశంలో సిరీస్ ఆడేందుకు అనుమతించామని పేర్కొన్నాడు. ఒకవేళ నేపాల్ జట్టు విదేశాల్లో సిరీస్ ఆడేందుకు వెళ్లాల్సి వస్తే న్యాయస్థానం చెప్పినట్లుగానే నడుచుకుంటామని స్పష్టం చేశాడు. కాగా 22 ఏళ్ల సందీప్ లమిచానే అత్యాచార ఆరోపణలతో గతేడాది సెప్టెంబరులో అరెస్టైన సంగతి తెలిసిందే.
బెయిలు మంజూరు
ఈ క్రమంలో దాదాపు మూడు నెలల పాటు జైల్లో ఉన్న అతడికి ఇటీవలే పఠాన్ కోర్టు బెయిల్ ఇవ్వడంతో విముక్తి లభించింది. అయితే, తీర్పు వచ్చేంత వరకు దేశం వదిలివెళ్లొద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నేపాల్ క్రికెట్ అసోసియేషన్ ఈ మేరకు అతడిపై సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. దీంతో స్వదేశంలో నమీబియా, స్కాట్లాండ్‌తో జరుగనున్న ట్రై సిరీస్‌లో అతడు ఆడనున్నాడు.
సుప్రీంకోర్టుకు వెళ్తాం
కాగా నేపాల్ కెప్టెన్‌గా ఉన్న సందీప్ లమిచానే.. ఐపీఎల్ సహా బీబీఎల్, పీఎస్‌ఎల్, బీపీఎల్, సీపీఎల్ వంటి టీ20 లీగ్‌లలో ఆడాడు. ఇదిలా ఉంటే లమిచానేకు బెయిల్ లభించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ అంశంపై తాము సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని అటార్నీ జనరల్ ఆఫీస్ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపినట్లు ట్రిబ్యూన్ పేర్కొంది.
చదవండి: Suryakumar Yadav: దుమ్ములేపిన సూర్య.. అదే జరిగితే మలన్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు
Johnson Charles: విధ్వంసం.. ఊచకోత.. అంతకుమించి, బీపీఎల్‌లో విండీస్ వీరుడి సునామీ శతకం