ముంబై ఇండియన్స్‌ ‘ట్రిపుల్‌ సెంచరీ’ | Mumbai Indians triple century | Sakshi
Sakshi News home page

ముంబై ఇండియన్స్‌ ‘ట్రిపుల్‌ సెంచరీ’

Mar 30 2026 2:41 AM | Updated on Mar 30 2026 2:41 AM

Mumbai Indians triple century

ముంబై: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో బరిలోకి దిగడం ద్వారా ముంబై ఇండియన్స్‌ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. 300 టి20 మ్యాచ్‌లు ఆడిన తొలి భారతీయ జట్టుగా గుర్తింపు పొందింది. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన మూడో జట్టుగా నిలిచింది. ఐపీఎల్‌ మొదలైనప్పటి నుంచి (2008) కొనసాగుతున్న ముంబై ఇండియన్స్‌ ఐదుసార్లు టైటిల్‌ సాధించింది. 

రోహిత్‌ శర్మ సారథ్యంలో ముంబై జట్టు 2013, 2015, 2017, 2019, 2020లలో విజేతగా నిలిచింది. ఆ తర్వాత ముంబై జట్టు మరోసారి ఐపీఎల్‌ టైటిల్‌ను సాధించడంలో విఫలమైంది. గత ఏడాది ముంబై జట్టు క్వాలిఫయర్‌–2లో పంజాబ్‌ కింగ్స్‌ జట్టు చేతిలో ఓడిపోయింది. 

ఇక అత్యధిక టి20 మ్యాచ్‌లు ఆడిన జట్ల జాబితాలో పాకిస్తాన్‌ జాతీయ జట్టు, సోమర్‌సెట్‌ కౌంటీ క్రికెట్‌ క్లబ్‌ జట్టు 303 మ్యాచ్‌లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. 296 మ్యాచ్‌లతో హాంప్‌షైర్‌ కౌంటీ క్రికెట్‌ క్లబ్‌ నాలుగో స్థానంలో, 287 మ్యాచ్‌లతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఐదో స్థానంలో ఉన్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement