
టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోనికి కార్లు, బైక్‌లు అంటే ఎంత పిచ్చి అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే రాంచీలో తన నివాసంలో ఉన్న గ్యారేజీలో లెక్కలేనన్ని కార్లు, బైకులు ఉన్నాయి. తాజాగా ధోని ఇంటికి మరో కొత్త కారు వచ్చి చేరింది. ఇటీవలే ధోని కియాకు చెందిన 'EV6'(SUV) కారుని కొనుగోలు చేసాడు. కాగా ధోని గ్యారేజిలో మొదటి ఎలక్ట్రిక్ కారు ఇదే కావడం విశేషం. ధోని కొన్న కియా కంపెనీ EV6 ధర దేశీయ మార్కెట్లో రూ.59.95 లక్షలుగా ఉంది.
ఇక ధోని కొన్న కొత్త కారులో రుతురాజ్ గైక్వాడ్, కేదార్ జాదవ్‌లు చక్కర్లు కొట్టడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ధోనినే స్వయంగా కారును డ్రైవ్ చేయడం విశేషం. ఇక అంతర్జాతీయ క్రికెట్‌కు రెండేళ్ల క్రితమే గుడ్‌బై చెప్పిన ధోని కేవలం ఐపీఎల్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. మరోవైపు రుతురాజ్, కేదార్ జాదవ్‌లు మాత్రం విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్నారు. మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఇద్దరు టోర్నీలో భాగంగా జార్ఖండ్‌తో మ్యాచ్ ఆడేందుకు రాంచీకి వచ్చారు. ఈ నేపథ్యంలోనే రుతురాజ్, కేదార్‌లు సరదాగా ధోని కారులో షికారుకెళ్లారు.
New Car in the house babyyy @msdhoni 😎pic.twitter.com/73ZZMxF4hv
— Best of MS Dhoni. (@BestOfMSD) November 17, 2022