Mohammed Shami Test Wickets Total: 200 Test Wickets In 55 Test Matches - Sakshi
Sakshi News home page

Mohammed Shami: సూపర్‌ షమీ.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు

Dec 28 2021 9:25 PM | Updated on Dec 29 2021 1:36 PM

Mohammed Shami 5 Wicket Haul Fewest Balls 200 Test Wickets India - Sakshi

టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో 5 వికెట్లతో సత్తా చాటాడు. తన పదునైన బంతులతో సౌతాఫ్రికా బ్యాట్స్‌మన్‌ను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు. షమీ బంతులకు ప్రొటీస్‌ బ్యాటర్ల వద్ద సమాధానం లేకుండా పోయింది. ఇక షమీకి టెస్టు కెరీర్‌లో ఐదు వికెట్ల హాల్‌ అందుకోవడం ఆరోసారి. ఈ ఆరింటిలో రెండుసార్లు(తాజా దానితో కలిపి) రెండుసార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకోగా.. మిగిలిన నాలుగుసార్లు రెండో ఇన్నింగ్స్‌లోనే ఐదు వికెట్ల ఫీట్‌ను సాధించడం విశేషం. ఈ క్రమంలోనే మహ్మద్‌ షమీ టెస్టుల్లో 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు.

చదవండి: IND Vs SA 1st Test: బుమ్రాకు గాయం.. టీమిండియా ఆందోళన

200 వికెట్ల మార్క్‌ను చేరుకోవడానికి షమీకి 55 టెస్టులు అవసరం అయ్యాయి. 50 టెస్టుల్లో కపిల్‌ దేవ్‌ 200 వికెట్ల మార్క్‌ సాధించి తొలి స్థానంలో నిలవగా.. జగవల్‌ శ్రీనాథ్‌(54 టెస్టుల్లో) రెండో స్థానం, షమీ(55 టెస్టులు) మూడో స్థానం, జహీర్‌ఖాన్‌, ఇషాంత్‌ శర్మలు సంయుక్తంగా 63 టెస్టులతో నాలుగో స్థానంలో ఉన్నారు.

ఇక టీమిండియా తరపున టెస్టుల్లో 200 వికెట్ల మార్క్‌ను అందుకోవడానికి షమీకి 9896 బంతులు అవసరమయ్యాయి. ఈ జాబితాలో షమీనే నెంబర్‌వన్‌ కావడం విశేషం. రెండోస్థానంలో అశ్విన్‌(10248 బంతులు), కపిల్‌ దేవ్‌(11066 బంతులు) మూడోస్థానం, రవీంద్ర జడేజా(11989 బంతులు) నాలుగో స్థానంలో​ ఉన్నారు.

చదవండి: Quinton De Kock: ఎంత ఔటైతే మాత్రం ఇంత కోపం అవసరమా డికాక్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement