పాకిస్తాన్‌పై సెంచరీతో చెలరేగాడు.. కాసేపటికే ఆసుపత్రిలో కుశాల్‌ మెండిస్‌ | Kusal Mendis taken to hospital after scoring a hundred against Pakistan | Sakshi
Sakshi News home page

WORLD CUP 2023: పాకిస్తాన్‌పై సెంచరీతో చెలరేగాడు.. కాసేపటికే ఆసుపత్రిలో కుశాల్‌ మెండిస్‌

Oct 10 2023 9:13 PM | Updated on Oct 10 2023 9:22 PM

Kusal Mendis taken to hospital after scoring a hundred against Pakistan - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా హైదరాబాద్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక స్టార్‌ బ్యాటర్‌ కుశాల్‌ మెండిస్‌ మెరుపు శతకంతో చెలరేగాడు. 77 బంతులు ఎదుర్కొన్న కుశాల్ మెండిస్ 14 ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 122 పరుగులు చేశాడు. అయితే తన సెంచరీ మార్క్‌ను మెండిస్‌ కేవలం 65 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.

తద్వారా వన్డే ప్రపంచకప్‌లో అత్యంత వేగంగా సెంచరీ కొట్టిన శ్రీలంక బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర పేరు మీద ఉండేది. 2015 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సంగక్కర 70 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

ఆసుపత్రికి కుశాల్‌ మెండిస్‌..
కాగా శ్రీలంక ఇన్నింగ్స్‌ ముగిసిన అనంతరం కుశాల్‌ మెండీస్‌ను హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. అతడు చేతి కండరాల నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో స్కానింగ్‌ కోసం అతడిని  ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్‌ బోర్డు ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా వెల్లడించింది.

"పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 77 బంతుల్లో 122 పరుగులతో అద్భుతంగా రాణించి డ్రెస్సింగ్‌ రూమ్‌కు వచ్చిన కుశాల్‌ మెండిస్‌ క్రాంప్స్‌తో బాధపడ్డాడు. దీంతో అతడిని మా సిబ్బంది ఆసుపత్రికి తీసుకువెళ్లారు. మెండిస్ తరుపున దుషన్ హేమంత సబ్‌స్ట్యూట్‌ ఫీల్డర్‌గా మైదానంలో వచ్చాడు. అదేవిధంగా మెండిస్ స్ధానంలో వికెట్‌ కీపింగ్‌ బాధ్యతలను సదీర సమరవిక్రమ స్వీకరించాడని" ఎక్స్‌(ట్విటర్‌)లో శ్రీలంక క్రికెట్‌ పేర్కొంది.
చదవండి: ODI WC 2023: వెళ్లి ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడుకో పో బాబర్‌.. పాక్‌ కెప్టెన్‌పై ఫ్యాన్స్‌ ట్రోల్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement