‘ధోనీలా నేనూ 5 ట్రోఫీలు గెలవాలి.. వాళ్లిద్దరు అద్భుతం’ | KL Rahul Hails Vaibhav Suryavanshi And Ayush Mhatre For Explosive T20 Batting, Says It's Phenomenal What The New Age Cricketers Are Doing | Sakshi
Sakshi News home page

‘ధోనీలా నేనూ 5 ట్రోఫీలు గెలవాలి.. వైభవ్‌, ఆయుశ్‌ అద్భుతం’

May 2 2026 1:10 PM | Updated on May 2 2026 1:54 PM

KL Rahul Hails Vaibhav Suryavanshi Ayush Mhatre For Explosive T20 Batting

ఐపీఎల్‌లో ట్రోఫీలు గెలవకుండా ఎన్ని వ్యక్తిగత మైలురాళ్లు సాధించినా వాటికి విలువ ఉండదని ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్లేయర్, భారత సీనియర్‌ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ అన్నాడు. ఐపీఎల్‌ తాజా సీజన్‌లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్న రాహుల్‌... ఇటీవలే లీగ్‌లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో మహేంద్ర సింగ్‌ ధోనీ (MS Dhoni)ని అధిగమించాడు. 

ధోనీలా నేనూ 5 ట్రోఫీలు గెలవాలి
ఐపీఎల్‌లో ధోనీ 5439 పరుగులు చేయగా... తాజాగా రాహుల్‌ అతడిని దాటేశాడు. ఈ నేపథ్యంలో రాహుల్‌ మాట్లాడుతూ... ‘ఐపీఎల్‌లో మహీ భాయ్‌ పరుగులను దాటేశానని కూడా నాకు తెలియదు. వ్యక్తిగత మైలురాళ్లు మంచివే. 

సరైన దిశలోనే ఉన్నామని అవి భరోసా ఇస్తాయి. కానీ అసలైంది మాత్రం నిలకడగా ట్రోఫీలు గెలవడమే. ధోనీ గెలిచినన్ని ఐపీఎల్‌ ట్రోఫీలు గెలవడమే నాకు నిజమైన ఆనందాన్ని ఇస్తుంది.

క్రికెట్‌ వ్యక్తిగత క్రీడ కాదు. టీమ్‌ స్పోర్ట్‌. అందుకే విజయవంతమైన జట్లలో భాగం కావాలని ఎల్లప్పుడూ కోరుకుంటూ ఉంటా’ అని రాహుల్‌ అన్నాడు. చిన్నప్పటి నుంచి బెంగళూరు చిన్నస్వామి స్టేడియంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని... అందుకే అక్కడ మ్యాచ్‌ అంటే భావోద్వేగానికి గురవుతానని రాహుల్‌ చెప్పాడు.

నాకు బెంగళూరు అలాంటిదే
‘కేవలం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌లోనే అని కాదు. చిన్నస్వామి స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడినా నా పరిస్థితి ఇలాగే ఉంటుంది. కొన్ని ప్రదేశాల్లో మీరు చాలా సౌకర్యవంతంగా భావిస్తారు. 

నాకు బెంగళూరు అలాంటిదే. అక్కడ క్రీజులో అడుగుపెట్టిన ప్రతిసారి ఏదో ఒకటి ప్రత్యేకంగా చేయాలని అనుకుంటా. కొత్తతరం ప్లేయర్లు బౌలర్‌ చరిత్ర చూసి షాట్‌లు ఆడటం లేదు’ అని రాహుల్‌ వివరించాడు.

వైభవ్‌, ఆయుశ్‌ అద్భుతం
వైభవ్‌ సూర్యవంశీ వంటి యువ ఆటగాళ్లు... ప్రపంచస్థాయి బౌలర్లయిన బుమ్రా, కమిన్స్‌లను ఎదుర్కొనేటప్పుడు ఏమాత్రం తడబడటం లేదన్నాడు రాహుల్‌. అవకాశం ఉంటే తొలి బంతి నుంచే భారీ షాట్‌లు కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని... ఆధునిక టీ20 క్రికెట్‌కు ఇలాంటి మనస్తత్వమే అవసరమని రాహుల్‌ వెల్లడించాడు. వైభవ్, ఆయుశ్‌ మాత్రే వంటి వాళ్లు టీ20లు ఆడే విధానాన్ని మార్చేస్తున్నారని రాహుల్‌ చెప్పుకొచ్చాడు. 

చదవండి: శ్రేయస్‌, సంజూ కాదు!.. భారత టీ20 కెప్టెన్‌గా ఊహించని పేరు!

Advertisement
 
Advertisement
Advertisement