Ipl 2021 Second Phase: తొలి దశలో.. ఆర్సీబీదే పైచేయి.. మరి నేడు?

KKR vs RCB Prediction: Who Will win Today Match - Sakshi

KKR vs RCB Prediction: ఐపీఎల్ ఫేజ్‌2లో భాగంగా  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో కోల్‌కతా నైట్ రైడర్స్ నేడు తలపడనుంది. ఈ నేపథ్యంలో ఏ జట్టు ఇప్పటివరకు పైచేయి సాధించిందో ఓ లుక్కేద్దాం. ప్రస్తుత సీజన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆర్సీబీను ఓడించడం కోల్‌కతాకు అంత సులభం ఏమి కాదు. ప్రస్తుత పాయింట్ల పట్టికలో ఆర్సీబీ 10 పాయింట్లతో మూడవ స్థానంలో ఉండగా, ప్రత్యర్ది కేకేఆర్ జట్టు ఏడవ స్థానంలో ఉంది.

అయితే ఇప్పటి వరకు ఐపీఎల్‌లో ఇరు జట్లు  27 మ్యాచ్‌ల​లో ముఖాముఖి తలపడగా కేకేఆర్ 14మ్యాచ్‌లలో గెలవగా, ఆర్‌సీబీ 13 మ్యాచ్‌లలో విజయం సాధించింది. కాగా ఐపీఎల్ తొలి దశలో ఏప్రిల్ 18 న ఒకదానికొకటి తలపడ్డాయి. ఆర్సీబీ 38 పరుగుల తేడాతో కేకేఆర్‌ జట్టును ఓడించింది.     

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బలాలు..
బెంగళూరు బలం ఆ జట్టు టాప్‌ ఆర్డర్‌. మ్యాచ్‌ ఫలితాలను ఒంటిచేత్తో తారుమారు చేయగల కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో పాటు, డివిల్లియర్స్‌, మ్యాక్స్‌వెల్‌, దేవదత్త్‌ పడిక్కల్‌ వంటి విధ్వంసకర ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. ఇంగ్లండ్‌ టూర్‌లో ఆదరగొట్టిన మహమ్మద్‌ సిరాజ్‌తోపాటు, హర్షల్‌ పటేల్‌, న్యూజిలాండ్‌ స్టార్‌ బౌలర్‌ ‍కైల్ జమీసన్, శ్రీలంక స్నిన్నర్‌ వనిందు హసరంగా వంటి ఆటగాళ్లతో ఆర్సీబీ బౌలింగ్‌ విభాగం పటిష్టంగా ఉంది.

బలహీనతలు
ఐపీఎల్ సెకండ్‌ ఫేజ్‌లో బెంగళూరుకు ఐదు మంది స్టార్‌ ఆటగాళ్లు దూరమయ్యారు. ఈ క్రమంలో కొత్తముఖాలకు జట్టులో చోటు దక్కింది. వారిలో దుష్మంత చమీరా, జార్జ్ గార్టన్, వనిందు హసరంగ, ఆకాశ్ దీప్, టిమ్ డేవిడ్ ఉన్నారు. ఈ సీజన్‌లో ఈ ఆటగాళ్లు ఎంతమేరకు రాణిస్తారో అన్నది చూడాలి.

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు బలాలు..
కోల్‌కతా జట్టు ప్రాధాన బలం బ్యాటింగ్‌. శుభ్ మాన్ గిల్, నితీష్ రానా, రాహుల్ త్రిపాఠి, మోర్గాన్, దినేష్ కార్తీక్ టిమ్ సీఫెర్ట్ వంటి స్టార్‌ బ్యాట్స్ మెన్‌లు ఉన్నారు. బ్యాట్‌తో పాటు బంతితోనూ రాణించగలిగే సామర్థ్యం ఉన్న బెన్ కట్టింగ్, షకీబ్ అల్ హసన్, సునీల్ నరైన్ వంటి ఆల్ రౌండర్లు జట్టులో ఉన్నారు. ముఖ్యంగా జట్టులో రస్సేల్‌ వంటి విద్వంసకర ఆల్‌రౌండర్‌ ఉండడం కోల్‌కతాకు కలిసొచ్చే అంశం.

బలహీనతలు 
కోల్‌కతాకు బౌలింగ్‌ ప్రధాన సమస్యగా మారింది. పేస్ బౌలింగ్​ విభాగం పేలవంగా కనిపిస్తోంది. కాగా ఐపీఎల్ సెకండ్‌ ఫేజ్‌లో కోల్‌కతాకు ఆ జట్టు స్టార్‌ బౌలర్‌ పాట్‌ కమిన్స్‌ దూరమ్యాడు. ఐపీఎల్ మెదటి పేజ్‌లో బంతితోనే కాకుండా బ్యాట్‌తోను కమిన్స్‌ ఆధ్బతంగా రాణించాడు. సెకండ్‌ ఫేజ్‌కు కమిన్స్‌ అందుబాటులో లేకపోవడం ఆ జట్టుకు పెద్ద ఎదురదెబ్బ. జట్టు పేస్ బౌలింగ్​ విభాగంలో లాకీ ఫెర్గూసన్‌ తప్ప అనుభవజ్ఞులైన మరో బౌలర్‌ మరొకరు లేరు. ఈ క్రమంలో బెంగళూరు బ్యాట్స్‌మన్‌లును కోల్‌కతా ఎంతవరకు కట్టడి చేస్తుందో వేచి చూడాలి.

కోల్‌కతా జట్టు (అంచనా):  శుభమాన్ గిల్, నితీష్ రాణా, రాహుల్ త్రిపాఠి, సునీల్ నరైన్, ఇయోన్ మోర్గాన్ (సి), ఆండ్రీ రస్సెల్, దినేష్ కార్తీక్ (కీపర్), లాకీ ఫెర్గూసన్, శివమ్ మావి/కమలేష్ నాగర్‌కోటి, ప్రసిద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి.

బెంగళూరు జట్టు (అంచనా): విరాట్ కోహ్లీ (సి), దేవదత్ పాడిక్కల్, రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్ (కీపర​), షాబాజ్ అహ్మద్/మహమ్మద్ అజారుద్దీన్, వనిందు హసరంగ, కైల్ జమీసన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top