IPL 2021 Phase 2: ఈ సారి ఆ జట్టే ఐపీఎల్ విజేత!

Kevin Pietersen: Chennai Super Kings have winning another IPL title - Sakshi

Kevin Pietersen On IPL 2021 Winner:  క్రికెట్ అభిమానులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. సెప్టెంబర్ 19 నుంచి  ఐపీఎల్‌ సెకండ్‌ ఫేజ్‌   మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఆదివారం జరిగే తొలి మ్యాచ్‌తో  ఈ ధనాధన్ లీగ్ సందడి మొదలవ్వనుంది. ఈ నేపథ్యంలో టోర్నీ విజేత పై ఇప్పటి నుంచే మాజీలు, క్రికెట్‌ నిపుణులు  అంచనాలు వేస్తున్నారు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌  కెవిన్ పీటర్సన్ తన ఆభిప్రాయాన్ని తెలిపాడు. ఈ సారి చెన్నై  సూపర్ కింగ్స్‌ టైటిల్‌ను  గెలుచుకునే అవకాశం ఉందని అతడు చెప్పాడు. ఐపీఎల్‌ 2020లో చెన్నై ఆటతీరు పూర్తిగా నిరాశపరచిందని.. ఐపీఎల్‌ చరిత్రలో తొలిసారిగా వారు ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకోలేదని పీటర్సన్‌ చెప్పాడు.

అయితే ధోనీ నేతృత్వంలోని జట్టు ఈసారి  ఐపీఎల్‌ ఫేజ్‌-1లో  తమ ఆధిపత్యాన్ని చాటుకున్న సంగతి తెలిసిందే. ఆ జట్టు ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌ల్లో ఐదు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉంది. కాగా డిఫెండింగ్ ఛాంపియన్స్‌ ముంబై ఇండియన్స్ గురించి పీటర్సన్‌ మాట్లాడుతూ.. ముంబై ప్రతిసారి నెమ్మదిగానే టోర్నీని ప్రారంభిస్తుందని.. లీగ్‌ మధ్యలో ఆ జట్టు ఊపు అందకుంటుందని  అభిప్రాయపడ్డాడు. లీగ్‌ మధ్యలో ఉంది కనుక ముంబై టైటిల్‌ రేసులో నిలవాలంటే వాళ్లు ఆడే ప్రతి మ్యాచ్‌ తప్పనిసరిగా గెలవాలని అతడు సూచించాడు. మరోవైపు  ప్రస్తుతం లీగ్‌ పాయింట్ల పట్టికలో  ఎనిమిది పాయింట్లతో నాల్గవ స్థానంలో ఉంది. 

చదవండి: Virat Kohli: కోహ్లి నిర్ణయం సరైందే.. తను వరల్డ్‌కప్‌ గెలవాలి

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top