
టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా తన పునరాగామాన్ని ఘనంగా చాటుకున్నాడు. చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బుమ్రా నిప్పలు చేరుగుతున్నాడు. తన పేస్ బౌలింగ్‌తో బంగ్లా బ్యాటర్లకు చూపిస్తున్నాడు.
బుమ్రా తను వేసిన తొలి ఓవర్‌లోలో భారత్‌కు వికెట్ అందించాడు. బంగ్లా ఓపెనర్ షాద్‌మాన్ ఇస్లాంను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. జస్ప్రీత్ వేసిన బంతికి షాద్‌మాన్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది.
బుమ్రా మాస్టర్ మైండ్..?
బంగ్లా ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన బుమ్రా.. మొదటి 5 బంతులను షాద్‌మాన్‌కు ఓవర్‌ది వికెట్ బౌల్ చేశాడు. అయితే బుమ్రా తెలివిగా ఆఖరి బంతిని రౌండ్ ది వికెట్ వేసి షాద్‌మాన్‌ను బోల్తా కొట్టించాడు. బుమ్ బుమ్ బుమ్రా చివరి బంతిని ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా అద్భుతమైన లెంగ్త్ డెలివరీగా సంధించాడు.
అయితే బ్యాక్ ఫుట్‌లో ఉన్న షాద్‌మాన్ బంతి లోపలికి రాదని భావించి ఆఫ్ స్టంప్‌ను కవర్ చేయకుండా విడిచిపెట్టాడు. కానీ బంతి ఊహించని విధంగా టర్న్ అవుతూ ఆఫ్‌స్టంప్‌ను గిరాటేసింది. దీంతో బంగ్లా ఓపెనర్ ఒక్కసారిగా బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరలవుతోంది.
Boom Boom Bumrah 🎇
Cleans up Shadman Islam with a peach of a delivery.
Live - https://t.co/jV4wK7BgV2… #INDvBAN@IDFCFIRSTBank | @Jaspritbumrah93 pic.twitter.com/RYi9AX30eA— BCCI (@BCCI) September 20, 2024