ఇస్మాయిల్‌ బేగ్‌ లేకుండా... | Ismail Baig not included in the coaching staff of the Indian rowing team participating in the Asian Games | Sakshi
Sakshi News home page

ఇస్మాయిల్‌ బేగ్‌ లేకుండా...

May 21 2026 3:55 AM | Updated on May 21 2026 3:56 AM

Ismail Baig not included in the coaching staff of the Indian rowing team participating in the Asian Games

న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత రోయింగ్‌ జట్టు కోచింగ్‌ బృందంలో దిగ్గజ కోచ్, ద్రోణాచార్య అవార్డీ ఇస్మాయిల్‌ బేగ్‌కు అవకాశం దక్కలేదు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బేగ్‌ ఏడు ఆసియా క్రీడల్లో భారత్‌కు కోచ్‌గా వ్యవహరించడంతో పాటు 23 ఏళ్ల పాటు భారత రోయింగ్‌ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. రోయింగ్‌ సమాఖ్య (ఆర్‌ఎఫ్‌ఐ) ప్రకటన తనను నిర్ఘాంతపర్చిందని, అధికారికంగా తాను ఇప్పటికీ భారత హెడ్‌ కోచ్‌నే అని బేగ్‌ అన్నారు. 

అయితే ఆర్‌ఎఫ్‌ఐ అధ్యక్షుడు ఎం.బాలాజీ తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. బేగ్‌ గొప్ప కోచ్‌గా ఎన్నో విజయాలు అందించడం వాస్తవమే అయినా... మార్పు సహజమని ఆయన వ్యాఖ్యానించారు. 2024 నుంచి భారత రోయింగ్‌ జట్టు ఆ్రస్టేలియాకు చెందిన ఆంటోనీ ప్యాటర్సన్‌ శిక్షణలోనే సన్నద్ధమవుతోందని, గత ఆసియా చాంపియన్‌షిప్‌లో కూడా ప్యాటర్సన్‌ కోచింగ్‌లో భారత్‌ 10 పతకాలు గెలిచిందని ఆయన  గుర్తు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement