ఐపీఎల్ 2026 ఆరంభ మ్యాచ్‌లోనే ఎస్‌ఆర్‌హెచ్ తాత్కాలిక కెప్టెన్ ఇషాన్ కిషన్ భారీ రికార్డు సాధించాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో బాధ్యతాయుతంగా ఆడుతున్న అతను.. ఐపీఎల్‌లో 3000 పరుగులు పూర్తి చేశాడు.
తద్వారా క్యాష్ లీగ్ చరిత్రలో అత్యంత వేగంగా ఈ మైలురాయిని తాకిన ఆరో భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఇషాన్ ఈ మైలురాయిని చేరుకునేందుకు 2180 బంతులు తీసుకోగా.. రిషబ్ పంత్ (2028), యూసఫ్ పఠాన్ (2082), సూర్యకుమార్ యాదవ్ (2130), సురేశ్ రైనా (2135), ఎంఎస్ ధోని (2152) అతని కంటే వేగంగా ఈ మైలురాయిని చేరుకున్నారు.
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌ఆర్‌హెచ్ కష్టాల్లో పడింది. ఆర్సీబీ అరంగేట్రం పేసర్ జేకబ్ డఫీ నిప్పులు చెరిగే బంతులతో ఎస్‌ఆర్‌హెచ్ టాపార్డర్‌ను కుప్పకూల్చాడు. ఈ దశలో ఇషాన్ బాధ్యతాయుతంగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిర్మించే ప్రయత్నం చేస్తున్నాడు.
అతనికి జతగా హెన్రిచ్ క్లాసెన్ క్రీజ్‌లో ఉన్నారు. 7 ఓవర్ల తర్వాత ఎస్‌ఆర్‌హెచ్ స్కోర్ 54-3గా ఉంది. ఇషాన్ (12 బంతుల్లో 25), క్లాసెన్ (7 బంతుల్లో 6) ఇన్నింగ్స్‌లు కొనసాగిస్తున్నారు. డఫీ అద్బుతమైన స్పెల్‌ను (4-0-22-3) ముగించాడు.
నిప్పులు చెరిగిన డఫీ
ఎస్‌ఆర్‌హెచ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. 29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. డఫీ ఎస్‌ఆర్‌హెచ్‌ను దారుణంగా దెబ్బకొట్టాడు. 3వ ఓవర్‌లో ఓపెనర్లు అభిషేక్ (7), హెడ్ (11) వికెట్లు తీసిన ఇతను.. ఐదో ఓవర్ తొలి బంతికే నితీశ్‌కుమార్ రెడ్డిని (1) పెవిలియన్‌కు పంపాడు.
తుది జట్లు..
ఆర్సీబీ: విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్‌కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాకబ్ డఫీ, సుయాష్ శర్మ
సన్‌రైజర్స్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(కెప్టెన్/వికెట్‌కీపర్), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ


