ఒక్క బెర్త్‌.. ఐదు జట్లు | IPL 2026 Playoff Race Heats Up As SRH And GT Seal Spot, Five Teams Battle For Final Berth, Read Story Inside | Sakshi
Sakshi News home page

IPL 2026 Playoffs: ఒక్క బెర్త్‌.. ఐదు జట్లు

May 19 2026 7:48 AM | Updated on May 19 2026 10:40 AM

IPL 2026: SRH, GT into Playoffs, 5 teams fight for remaining berth

ఐపీఎల్‌ 2026 ప్లే ఆఫ్స్‌ రేసు రసవత్తరంగా మారింది. నిన్న (మే 18) సీఎస్‌కేను ఓడించడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ ఓ బెర్త్‌ ఖరారు చేసుకుంది. వెళ్తూ వెళ్తూ ఆ జట్టు గుజరాత్‌ను కూడా ఫైనల్‌-4లోకి తీసుకెళ్లింది. అంతకుముందే ఆర్సీబీ ఓ బెర్త్‌ కన్ఫర్మ్‌ చేసుకుంది. ప్రస్తుతానికి మూడు జట్లు బెర్త్‌లు ఖరారు చేసుకోగా.. మిగిలిన ఏకైక బెర్త్‌ కోసం ఏకంగా ఐదు జట్లు పోటీపడుతున్నాయి.

ఆ జట్లు ఏవి.. ఏ జట్టుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. ఏ జట్టుకు స్వల్పంగా ఉన్నాయి.. ఈ అంశాలపై ఓ లుక్కేద్దాం. మిగిలిన ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ కోసం పంజాబ్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌, సీఎస్‌కే, ఢిల్లీ, కేకేఆర్‌ జట్లు పోటీపడుతున్నాయి. వీటిలో రాజస్థాన్‌కు అవకాశాలు ఎక్కువగా ఉండగా.. ఢిల్లీ తక్కువగా ఉన్నాయి. మిగతా మూడు జట్లలో చూసుకుంటే పంజాబ్‌, కేకేఆర్‌కు సమాన అవకశాలు ఉండగా.. సీఎస్‌కేకు కాస్త తక్కువ అవకాశాలు ఉన్నాయి.

ముందుగా రాజస్థాన్‌ను తీసుకుంటే.. ఈ జట్టు లీగ్‌ దశలో ఇంకా 2 మ్యాచ్‌లు (లక్నో, ముంబై) ఆడాల్సి ఉంది. ప్రస్తుతం ఈ జట్టు ఖాతాలో 12 పాయింట్లు ఉన్నాయి. మిగతా రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే ఈ జట్టు మిగతా జట్ల జయాపజయాలతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. మిగతా జట్లు వారు ఆడాల్సిన అన్ని మ్యాచ్‌లు గెలిచినా రాయల్స్‌ (16) ఉండే పాయింట్లు ఉండవు. కాబట్టి పోటీలో ఉన్న ఐదు జట్లలో రాయల్స్‌కే అవకాశాలు ఎక్కువ.

రేసులో రెండో అతి పెద్ద అవకాశాలు ఉన్న జట్లు పంజాబ్‌, కేకేఆర్‌. ఈ రెండు జట్లు సమాన అవకాశాలు కలిగి ఉన్నాయి. పంజాబ్‌ వారు ఆడాల్సిన ఏకైక మ్యాచ్‌లో (లక్నో) గెలిస్తే 15 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది (రాజస్థాన్‌ ఏదైనా మ్యాచ్‌ ఓడిన పక్షంలో, మిగతా జట్లతో పనిలేదు). ఈ జట్టుకు మంచి రన్‌రేట్‌ ఉండటం​ అదనపు బెనిఫిట్‌ (కేకేఆర్‌తో పోలిస్తే) అవుతుంది.

ఇక కేకేఆర్‌ విషయానికొస్తే.. ఈ జట్టు ఆడాల్సిన 2 మ్యాచ్‌ల్లో (ముంబై, ఢిల్లీ) భారీ తేడాతో గెలిస్తే ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది (రాజస్థాన్‌ కనీసం ఒక మ్యాచ్‌ అయినా ఓడి, పంజాబ్‌ ఆడాల్సిన ఏకైక మ్యాచ్‌లో ఓడితే). ఒ‍క్క మ్యాచ్‌లో ఓడినా ఇంటి ముఖం పట్టాల్సి ఉంటుంది.

సీఎస్‌కే విషయానికొస్తే.. ఈ జట్టు ఆడాల్సిన ఏకైక మ్యాచ్‌లో (గుజరాత్‌) భారీ తేడాతో గెలిస్తే బెర్త్‌ ద​క్కే అవకాశం ఉంది (రాజస్థాన్‌ రెండు మ్యాచ్‌ల్లో ఓడాలి, పంజాబ్‌ ఓడాలి, కేకేఆర్‌ కనీసం ఒక మ్యాచ్‌ అయినా ఓడాలి, డీసీ ఓడాలి).

చివరిగా ఢిల్లీ విషయానికొస్తే.. ఈ జట్టు ఆడాల్సిన ఏకైక మ్యాచ్‌లో (కేకేఆర్‌) భారీ తేడాతో గెలిస్తే ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ దక్కే అవకాశం ఉంది (కేకేఆర్‌ కనీసం ఒక మ్యాచ్‌ అయినా ఓడాలి, రాజస్థాన్‌ రెండు మ్యాచ్‌ల్లో ఓడాలి, పంజాబ్‌ ఓడాలి, సీఎస్‌కే ఓడాలి). 

Advertisement
 
Advertisement
Advertisement