చరిత్ర సృష్టించిన ఇషాన్‌ కిషన్‌ | IPL 2026, RCB VS SRH: Ishan Kishan scored Highest individual score on IPL captaincy debut for SRH | Sakshi
Sakshi News home page

IPL 2026, RCB VS SRH: చరిత్ర సృష్టించిన ఇషాన్‌ కిషన్‌

Mar 28 2026 9:19 PM | Updated on Mar 28 2026 9:49 PM

IPL 2026, RCB VS SRH: Ishan Kishan scored Highest individual score on IPL captaincy debut for SRH

ఎస్‌ఆర్‌హెచ్‌ తాత్కాలిక సారధి ఇషాన్‌ కిషన్‌ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదారాబాద్‌ తరఫున కెప్టెన్సీ అరంగేట్రంలో అత్యధిక స్కోర్‌ సాధించిన ఆటగాడిగా అవతరించాడు. గతంలో ఈ రికార్డు మనీశ్‌ పాండే (69 నాటౌట్‌) పేరిట ఉండేది. ఐపీఎల్‌ 2026లో భాగంగా ఆర్సీబీతో ఇవాళ (మార్చి 28) జరుగుతున్న మ్యాచ్‌లో ఇషాన్‌ ఈ రికార్డు నమోదు చేశాడు.

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇషాన్‌ కష్టాల్లో ఉన్న తన జట్టును అద్భుతమైన ఇన్నింగ్స్‌తో గట్టెక్కించే క్రమంలో ఈ రికార్డు సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 38 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసిన ఇషాన్‌.. అభినందన్‌ సింగ్‌ బౌలింగ్‌లో సాల్ట్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో పెవిలియన్‌కు చేరాడు.

ఈ ఇన్నింగ్స్‌తో ఇషాన్‌ మరో ఘనత కూడా సాధించాడు. ఐపీఎల్‌ కెప్టెన్సీ అరంగేట్రంలో అత్యధిక స్కోర్లు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు.

ఐపీఎల్‌ కెప్టెన్సీ అరంగేట్రంలో అత్యధిక స్కోర్లు
119 - సంజు శాంసన్ (RR) vs PBKS, 2021
99* - మయాంక్ అగర్వాల్ (PBKS) vs DC, 2021
93* - శ్రేయస్ అయ్యర్ (DC) vs KKR, 2018
88 - ఫాఫ్ డు ప్లెసిస్ (RCB) vs PBKS, 2022
83 - కీరన్ పొలార్డ్ (MI) vs PBKS, 2019
80 - ఇషాన్ కిషన్ (SRH) vs RCB, 2026*

కాగా, ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న ఎస్‌ఆర్‌హెచ్‌ 29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినప్పటికీ.. ఇషాన్‌ కిషన్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడి తన జట్టును ఆదుకున్నాడు. అతనికి క్లాసెన్‌ (31) కాసేపు సహకరించాడు.18 ఓవర్ల తర్వాత ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోర్‌ 8 వికెట్ల నష్టానికి 175 పరుగులుగా ఉంది. అనికేత్‌ వర్మ (27), డేవిడ్‌ పేన్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు. 

సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌లో హెడ్‌ 11, అభిషేక్‌ 7, నితీశ్‌ కుమార్‌ రెడ్డి 1, సలీల్‌ అరోరా 9, హర్ష్‌ దూబే 3, హర్షల్‌ పటేల్‌ డకౌటయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో డఫీ 3, రొమారియో షెపర్డ్‌ 2, భువనేశ్వర్‌ కుమార్‌, అభినందన్‌ సింగ్‌, సుయాశ్‌ శర్మ తలో వికెట్‌ తీశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement