అనుకున్న‌దే జ‌రిగింది.. రూ.25 కోట్ల ప్లేయ‌ర్ అట్ట‌ర్ ప్లాప్‌ | IPL 2026: Most Expensive Foreign Buy Cameron Green Flops in KKR Debut Against MI | Sakshi
Sakshi News home page

IPL 2026: అనుకున్న‌దే జ‌రిగింది.. రూ.25 కోట్ల ప్లేయ‌ర్ అట్ట‌ర్ ప్లాప్‌

Mar 29 2026 9:07 PM | Updated on Mar 30 2026 10:25 AM

IPL 2026: Most Expensive Foreign Buy Cameron Green Flops in KKR Debut Against MI

ఐపీఎల్‌-2026 సీజ‌న్‌ను కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌ ఆల్‌రౌండ‌ర్ కామెరాన్ గ్రీన్ పేల‌వంగా ఆరంభించాడు. ఐపీఎల్‌లో అత్యంత ఖ‌రీదైన విదేశీ ఆట‌గాడిగా నిలిచిన గ్రీన్‌.. త‌ను ఆడిన తొలి మ్యాచ్‌లో ఏ మాత్రం ప్ర‌భావం చూపలేక‌పోయాడు. వాంఖ‌డే వేదిక‌గా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 10 బంతులు ఎదుర్కొన్న గ్రీన్‌ కేవ‌లం 18 ప‌రుగులు మాత్ర‌మే చేసి నిరాశ‌ప‌రిచాడు. 

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌కు ఓపెన‌ర్లు అజింక్య ర‌హానే(67), ఫిన్ అలెన్(37) అద్భుత‌మైన ఆరంభాన్ని ఇచ్చారు. ఫిల్ అలెన్ ఔట‌య్యాక క్రీజులోకి గ్రీన్ వచ్చాడు. గ్రీన్ ఓ ఫోర్‌, సిక్సర్ బాది జోష్‌లో క‌న్పించాడు. కానీ గ్రీన్ త‌న జోరును కొన‌సాగించ‌లేక‌పోయాడు. శార్ధూల్ ఠాకూర్ బౌలింగ్‌లో రూథ‌ర్ ఫ‌ర్డ్‌కు క్యాచ్ ఇచ్చి గ్రీన్ ఔట‌య్యాడు.

కాగా గతేడాది జ‌రిగిన మినీ వేలంలో గ్రీన్‌ను రూ. 25.20 కోట్ల భారీ ధ‌ర వెచ్చించి కేకేఆర్‌ మ‌రి కొనుగోలు చేసింది. అయితే చాలా మంది గ్రీన్‌కు అంత ధ‌ర వెచ్చించ‌డాన్ని త‌ప్పుబ‌ట్టారు. ఇప్పుడు అంద‌రూ అంచ‌నా వేసిన‌ట్లే తొలి మ్యాచ్‌లోనే గ్రీన్ విఫ‌ల‌మ‌య్యాడు. అంత‌కుముందు జ‌రిగిన టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లోనూ గ్రీన్ దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. ఇప్పుడు ఐపీఎల్‌లోనూ అదే తీరును కొన‌సాగించేలా క‌న్పిస్తున్నాడు.

తుది జట్లు..
ముంబై ఇండియన్స్‌: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(వికెట్‌కీపర్‌), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, నమన్ ధీర్, శార్దూల్ ఠాకూర్, మయాంక్ మార్కండే, ఘజన్‌ఫర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా

కేకేఆర్‌: ఫిన్ అలెన్, అజింక్యా రహానే(కెప్టెన్‌), కామెరూన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ (వికెట్‌ కీపర్‌), రింకు సింగ్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, బ్లెస్సింగ్ ముజారబానీ

Advertisement
 
Advertisement
Advertisement