పంజాబ్‌పై గుజరాత్‌ గెలుపు | IPL 2026 Match 46: Gujarat Titans vs Punjab Kings Match Live Score Updates, Squad Details And Highlights | Sakshi
Sakshi News home page

పంజాబ్‌పై గుజరాత్‌ గెలుపు

May 3 2026 7:05 PM | Updated on May 3 2026 11:32 PM

IPL 2026, Match 46: Gujarat Titans vs Punjab Kings Live Updates And Highlights

పంజాబ్‌పై గుజరాత్‌ గెలుపు
ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (మే 3) రాత్రి జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌పై గుజరాత్‌ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో మరో బంతి మాత్రమే మిగిలుండగా వాషింగ్టన్‌ సుందర్‌ (40 నాటౌట్‌) సిక్సర్‌ బాది గుజరాత్‌ను గెలిపించాడు. అంతకుముందు సాయి సుదర్శన్‌ (57) అర్ద సెంచరీతో రాణించి, గెలుపుకు పునాది వేశాడు. 

అయితే గుజరాత్‌ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఒత్తిడికి లోనైంది. దీంతో సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్‌ చివ​రి ఓవర్‌ వరకు సాగింది. ఈ మధ్యలో పం​జాబ్‌ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. బార్ట్‌లెట్‌ (4-0-38-2), అర్షదీప్‌ సింగ్‌ (4-0-24-2), జన్సెన్‌ (4-0-33-1), విజయ్‌ కుమార్‌ (4-0-31-2) తమ పాత్రలకు న్యాయం చేశారు. 

ఆఖరి ఓవర్‌ వేసిన స్టోయినిస్‌ (2.5-0-26-1) లక్ష్యాన్ని కాపాడలేకపోయాడు. ఈ ఓవర్‌లో ఓ ఫోర్‌, ఓ సిక్సర్‌ వచ్చింది. గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్‌ గిల్‌ (5), నిషాంత్‌ సంధు (15), తెవాతియా (2), హోల్డర్‌ (2) తక్కువ స్కోర్లకే ఔట్‌ కాగా.. బట్లర్‌ (26) ఓ మోస్తరు స్కోర్‌ చేశాడు. ఆఖరి ఓవర్‌ తొలి బంతికి అర్షద్‌ ఖాన్‌ (8 నాటౌట్‌) బౌండరీ బాది లక్ష్యానికి చేరువ చేశాడు.

నాలుగో వికెట్‌ కోల్పోయిన గుజరాత్‌
14.5వ ఓవర్‌- 124 పరుగుల వద్ద గుజరాత్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. విజయ్‌ కుమార్‌ బౌలింగ్‌లో బార్ట్‌లెట్‌కు క్యాచ్‌ ఇచ్చి సాయి సుదర్శన్‌ (57) ఔటయ్యాడు.

మూడో వికెట్‌ కోల్పోయిన గుజరాత్‌
11.3వ ఓవర​్‌- 94 పరుగుల వద్ద గుజరాత్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. స్టోయినిస్‌ బౌలింగ్లో విజయ్‌ కుమార్‌కు క్యాచ్‌ ఇచ్చి నిషాంత్‌ సింధు (15) ఔటయ్యాడు.

రెండో వికెట్‌ కోల్పోయిన గుజరాత్‌
8.1వ ఓవర్‌- 69 పరుగుల వద్ద గుజరాత్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. విజయ్‌ కుమార్‌ బౌలింగ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌కు క్యాచ్‌ ఇచ్చి బట్లర్‌ (26) ఔటయ్యాడు. 

ఆదిలోనే గుజరాత్‌కు షాక్‌
1.3వ ఓవర్‌: 164 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో గుజరాత్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. ఆ జట్టు కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (5) రెండో ఓవర్‌లోనే అర్షదీప్‌ బౌలింగ్‌లో కూపర్‌ కన్నోల్లీకి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 

పంజాబ్‌ స్కోర్‌ 163-9
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ పడుతూ లేస్తూ చివరికి గౌరవప్రదమైన స్కోర్‌ చేయగలిగింది. సూర్యాంశ్‌ షేడ్గే (57), మార్కస్‌ స్టోయినిస్‌ (40), ఆఖర్లో మార్కో జన్సెన్‌ రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. గుజరాత్‌ బౌలర్లలో జేసన్‌ హోల్డర్‌ (4-0-24-4) పంజాబ్‌ను భారీ దెబ్బకొట్టాడు. తొలుత సిరాజ్‌ (4-0-28-2), రబాడ (4-1-22-2) కూడా పంజాబ్‌ను కష్టాల్లోకి నెట్టారు. 

మిగతా బౌలర్లలో రషీద్‌ ఖాన్‌ (4-0-32-1) పర్వాలేదనిపించగా.. మానవ్‌ సుతార్‌ (1-0-27-0), అర్షద్‌ ఖాన్‌ (3-0-29-0) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో ప్రియాంశ్‌ ఆర్మ 2, ప్రభ్‌సిమ్రన్‌ 15, కూపర్‌ కన్నోల్లీ డకౌట్‌, శ్రేయస్‌ అయ్యర్‌ 19, నేహల్‌ వధేరా, జేవియర్‌ బార్ట్‌లెట్‌ డకౌటయ్యారు. విజయ్‌ కుమార్‌, అర్షదీప్‌ తలో పరుగుతో అజేయంగా నిలిచారు. 

పతనం అంచుల్లో పంజాబ్‌
పంజాబ్‌ కింగ్స్‌ మరోసారి వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్‌లో సిరాజ్‌, 18వ ఓవర్‌లో హోల్డర్‌ ఈ ఘనత సాధించారు. తాజాగా హోల్డర్‌ స్టోయినిస్‌ (40), బార్ట్‌లెట్‌ (0)ను వరుస బంతుల్లో ఔట్‌ చేశాడు. 

ఆరో వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌
15.6వ ఓవర్‌- 126 పరుగుల వద్ద పంజాబ్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. రబాడ బౌలింగ్‌లో సూర్యాంశ్‌ షేడ్గే (57) ఔటయ్యాడు. 

పీకల్లోతు కష్టాల్లో పంజాబ్‌
8.4వ ఓవర్‌- 47 పరుగుల వద్ద పంజాబ్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. హోల్డర్‌ బౌలింగ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ (19) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 

కష్టాల్లో పంజాబ్‌
6.3వ ఓవర్‌- పంజాబ్‌ జట్టు కష్టాల్లో పడింది. 36 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. తాజాగా నేహల్‌ వధేరాను (0) హోల్డర్‌ ఔట్‌ చేశాడు. బట్లర్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టాడు. 

మూడో వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌
5.2వ ఓవర్‌- 35 పరుగుల వద్ద పంజాబ్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. రబాడ బౌలింగ్‌లో మానవ్‌ సుతార్‌కు క్యాచ్‌ ఇచ్చి ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (15) ఔటయ్యాడు. 

తొలి ఓవర్‌లోనే 2 వికెట్లు కోల్పోయిన పంజాబ్‌
పంజాబ్‌ తొలి ఓవర్లోనే 2 వికెట్లు కోల్పోయింది. సిరాజ్‌ వరుస బంతుల్లో ప్రియాంశ్‌ ఆర్య (2), కన్నోల్లీ (0)ని ఔట్‌ చేశాడు.

తొలి వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌
0.2వ ఓవర్‌- ఇన్నింగ్స్‌ రెండో బంతికే పంజాబ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. సిరాజ్‌ బౌలింగ్‌లో నిషాంత్‌ సంధుకు క్యాచ్‌ ఇచ్చి ప్రియాంశ్‌ ఆర్మ (2) ఔటయ్యాడు.

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్నగుజరాత్‌
ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (మే 3) జరుగుతున్న 46వ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ తలపడుతున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. 

ప్రస్తుతం పంజాబ్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా.. గుజరాత్‌ ఐదో స్థానంలో ఉంది. పంజాబ్‌ 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి, ఓ మ్యాచ్‌లో ఓడగా.. గుజరాత్‌ 9 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, 4 అపజయాలు ఎదుర్కొంది.

తుది జట్లు..
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (w), ప్రియాంష్ ఆర్య, కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్ (సి), మార్కస్ స్టోయినిస్, సూర్యాంశ్ షెడ్జ్, నెహాల్ వధేరా, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ 

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్(సి), సాయి సుదర్శన్, జోస్ బట్లర్(w), వాషింగ్టన్ సుందర్, నిశాంత్ సింధు, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, మానవ్ సుతార్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement