ఎస్‌ఆర్‌హెచ్‌కు షాకిచ్చిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ | IPL 2026 KKR Vs SRH, Kolkata Knight Riders Won By 7 Wickets, Check Score Details Inside | Sakshi
Sakshi News home page

IPL 2026 SRH Vs KKR: ఎస్‌ఆర్‌హెచ్‌కు షాకిచ్చిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌

May 3 2026 7:06 PM | Updated on May 3 2026 7:41 PM

IPL 2026 KKR vs SRH: Kolkata Knight Riders won by 7 wkts

ఐపీఎల్‌-2026లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ షాకిచ్చింది. ఉప్పల్ మైదానం వేదికగా జరిగిన ‍మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌పై 7 వికెట్ల తేడాతో కేకేఆర్ ఘన విజయం సాధిం‍చింది. సన్‌రైజర్స్ నిర్ధేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.2 ఓవర్లలో చేధించింది. 

కేకేఆర్ బ్యాటర్లలో అంగక్రిష్ రఘువంశీ(59) హాఫ్ సెంచరీతో సత్తాచాటగా.. కెప్టెన్ అజింక్య రహానే(43), ఫిన్ అలెన్‌(29), రింకూ సింగ్‌(22 నాటౌట్‌) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. హైదరాబాద్ బౌలర్లలో షకీబ్‌, కమ్మిన్స్, శివాంగ్‌ కుమార్‌ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ 19 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది. 

ఓ దశలో 105/2తో ప‌టిష్టంగా క‌న్పించిన స‌న్‌రైజ‌ర్స్ కేవ‌లం 60 ప‌రుగుల వ్య‌వ‌ధిలో 8 వికెట్లు కోల్పోయింది. కేకేఆర్ బౌల‌ర్ల‌లో కేకేఆర్‌ బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి మూడు వికెట్లు పడగొట్టగా.. త్యాగీ, నరైన్‌ తలా రెండు వికెట్లు సాధించారు. ఎస్ఆర్‌హెచ్ బ్యాట‌ర్ల‌లో ట్రావెస్‌ హెడ్‌(61), ఇషాన్‌ కిషన్‌(42) మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఈ ఏడాది సీజన్‌లో సన్‌రైజర్స్ ఆలౌట్ కావడం ఇదే తొలిసారి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement