
హార్దిక్ పాండ్యాతో రోహిత్ శర్మ(ఫైల్ ఫొటో- PC: BCCI)
టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ మాజీ సారథి రోహిత్ శర్మ ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ సన్నాహకాలు మొదలుపెట్టాడు. సోమవారమే ముంబై శిబిరానికి చేరుకున్న హిట్‌మ్యాన్ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఫ్రాంఛైజీ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.
రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్న దృశ్యాలను పంచుకుంటూ.. ఒక్కో షాట్‌కు ఒకరకమైన ఎమోజీ జత చేస్తూ.. భిన్న భావోద్వేగాల సమాహారం అని పేర్కొంది. కాగా ఐపీఎల్ చరిత్రలో అత్యధికసార్లు జట్టును చాంపియన్‌గా నిలిపిన తొలి కెప్టెన్‌గా రోహిత్ శర్మ రికార్డులకెక్కిన విషయం తెలిసిందే.
रोहित चं आगमन, प्रेस कॉन्फरेन्स आणि बरंच काही... 💙 ➡️ https://t.co/bqa3bZ62DP
— Mumbai Indians (@mipaltan) March 19, 2024
Check out the full version of #MIDaily on our website & MI App now! #OneFamily #MumbaiIndians pic.twitter.com/LhBqamTtXO
ఆరంభంలో దక్కన్ చార్జర్స్ (హైదరాబాద్)కు ఆడిన ఈ ముంబై బ్యాటర్.. అనంతరం ముంబై ఇండియన్స్‌లో చేరి కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. ఏకంగా ఐదుసార్లు జట్టుకు టైటిల్ అందించి విజయవంతమైన నాయకుడిగా నీరజనాలు అందుకున్నాడు.
ఈ క్రమంలో టీమిండియా పగ్గాలు కూడా చేపట్టి కెప్టెన్‌గా రాణిస్తున్నాడు. అయితే, ఐపీఎల్-2024కు ముందు అనూహ్యంగా ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మపై వేటు వేసింది. కెప్టెన్‌గా అతడిని తప్పించి గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది.
ఈ నేపథ్యంలో అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది ముంబై ఫ్రాంఛైజీ. తాజా వీడియో నేపథ్యంలోనూ.. ‘‘రోహిత్ క్రీజులో ఉన్నంత వరకు ఎంఐకి మా మద్దతు’’ అంటూ క్రేజీ కామెంట్లు చేస్తున్నారు ఫ్యాన్స్.
ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024లోనూ భారత జట్టును ముందుకు నడిపించేది రోహిత్ శర్మనే అని భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే, ఈసారి విచిత్రంగా అతడు హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబై ఇండియన్స్‌కు ఆడనుండగా.. అనంతరం ఐసీసీ టోర్నీలో పాండ్యా మళ్లీ రోహిత్ కెప్టెన్సీలో బరిలోకి దిగనున్నాడు.
ఇక రోహిత్ శర్మ ఇటీవలే స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో ఆడాడు. విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ వంటి కీలక బ్యాటర్లు లేకుండానే యువ జట్టుతో స్టోక్స్ బృందాన్ని 4-1తో మట్టికరిపించి ట్రోఫీ గెలిచాడు.
చదవండి: Hardik Pandya: నా కెప్టెన్సీలో ఆడటానికి రోహిత్‌కు ఇబ్బంది ఎందుకు?.. నిజానికి..
🙂 ➡️ 😊 ➡️ 😃 ➡️ 😁#OneFamily #MumbaiIndians @ImRo45 pic.twitter.com/PtPtYBGsfc
— Mumbai Indians (@mipaltan) March 19, 2024