
చెన్నై సూపర్ కింగ్స్ నూతన కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ ఎంపికైన విషయం తెలిసిందే. రుతురాజ్ పేరును మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనినే స్వయంగా ప్రతిపాదించాడు. రేపటి నుంచి ప్రారంభంకాబోయే ఐపీఎల్ 17వ సీజన్‌లో రుతురాజ్ సీఎస్‌కే సారధిగా వ్యవహరించనున్నాడు. సీఎస్‌కే నూతన కెప్టెన్‌గా ఎంపికైన నేపథ్యంలో రుతురాజ్‌పై శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
GOOSEBUMPS TO SEE THIS...!!!!! 🔥 pic.twitter.com/MdD6IzBbbu
— CricketMAN2 (@ImTanujSingh) March 21, 2024
ధోని వీరాభిమానులు మినహా యావత్ క్రికెట్ ప్రపంచం రుతురాజ్‌కు ఆల్ ద బెస్ట్ చెబుతుంది. రేపే రుతురాజ్ కెప్టెన్‌గా తొలి పరీక్షను ఎదుర్కోబోతున్నాడు. రేపు జరుగబోయే సీజన్ ఆరంభ మ్యాచ్‌లో రుతురాజ్ నేతృత్వంలోని సీఎస్‌కే.. ఆర్సీబీతో తలపడనుంది. సీనియర్లు, జూనియర్ల మిశ్రమంగా ఉన్న సీఎస్‌కేను 27 ఏళ్ల రుతురాజ్ ఏరకంగా హ్యాండిల్ చేస్తాడన్న అంశం ఆసక్తికరంగా మారింది. ధోని జట్టుతో పాటే ఉండనుండటం రుతురాజ్‌కు ఊరట కలిగించే అంశం.
The Meet up of MS Dhoni and Faf Du Plessis at Chepauk.
— CricketMAN2 (@ImTanujSingh) March 21, 2024
- TWO BROTHERS MEETS...!!!! ❤️ pic.twitter.com/sGndbdCWI3
కాగా, రుతురాజ్ సీనియర్లతో కూడిన జట్టును ఎలా హ్యాండిల్ చేయగలడో అన్న సందేహాలున్న వారికి ఈ గణంకాలు ఊరట కలిగిస్తాయి. కెప్టెన్‌గా రతురాజ్‌కు మంచి ట్రాక్ రికార్డే ఉంది. ముఖ్యంగా టీ20ల్లో రుతు కెప్టెన్‌గా 60 శాతం విజయాలు సాధించాడు.
Faf Du Plessis and Ruturaj Gaikwad in today's practice session at Chepauk.
— CricketMAN2 (@ImTanujSingh) March 21, 2024
- THE TWO CAPTAINS...!!!! pic.twitter.com/JwYIM56bdr
టీ20ల్లో మహారాష్ట్ర, పుణేరీ బప్పా జట్లకు సారధ్యం వహించిన రుతు.. ఈ రెండు జట్ల తరఫున 16 మ్యాచ్‌లకు నాయకత్వం వహించి 10 విజయాలు సాధించాడు. 5 మ్యాచ్‌ల్లో రుతురాజ్ తన జట్టును గెలిపించలేకపోగా.. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. సీనియర్లతో కూడిన జట్టును నడిపించాలంటే కెప్టెన్‌గా ఈ మాత్రం ట్రాక్ రికార్డు సరిపోతుందని రుతురాజ్ అభిమానులు అనుకుంటున్నారు.
ఇదిలా ఉంటే, కెప్టెన్‌గా ఎంపిక విషయం అధికారింగా వెలువడ్డ తర్వాత రుతురాజ్ చాలా ఆనందంగా కనిపించాడు. ఆర్సీబీ సభ్యులతో కలిసి చెపాక్ స్టేడియంలో ప్రాక్టీస్‌లో పాల్గొన్న రుతు..ఇరు జట్ల ఆటగాళ్లతో సరదాగా గడిపాడు.