Breadcrumb
Live Updates
IPL 2022: ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ లైవ్ అప్డేట్స్
ఎస్ఆర్హెచ్పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం
ఐపీఎల్ 2022లో భాగంగా ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 21 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది. 208 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్ఠానికి 186 పరుగులే చేయగలిగింది. పూరన్ 62 మినహా మిగతావారు పెద్దగా రాణించకపోవడంతో ఎస్ఆర్హెచ్ హ్యాట్రిక్ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 3, శార్దూల్ ఠాకూర్ 2, నోర్ట్జే, మిచెల్ మార్ష్, కుల్దీప్ యాదవ్‌లు చెరొక వికెట్ తీశారు.మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ సీజన్లో ఐదో విజయంతో ప్లే ఆఫ్ రేసులో నిలిచింది.
నికోలస్ పూరన్(62) ఔట్.. పరాజయం దిశగా ఎస్ఆర్హెచ్
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ పరాజయం దిశగా పయనిస్తోంది. దాటిగా ఆడుతున్న నికోలస్ పూరన్(62) శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో పావెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 18 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.
మార్క్రమ్(42) ఔట్.. నాలుగో వికెట్ డౌన్
నిలకడగా ఆడుతున్న మార్క్రమ్(42) ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఎస్ఆర్హెచ్ నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ 4 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ 38, శశాంక్ సింగ్ 6 పరుగులతో ఆడుతున్నారు.
12 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ 90/3
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 12 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. మార్క్రమ్ 42, నికోలస్ పూరన్ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు.
9 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ 48/3
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 9 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 48 పరుగులు చేసింది. మార్క్రమ్ 11, నికోలస్ పూరన్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు 22 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠి మిచెల్ మార్ష్ బౌలింగ్‌లో శార్దూల్ ఠాకూర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఎస్ఆర్హెచ్ గెలవాలంటే 66 బంతుల్లో 160 పరుగులు చేయాలి.
టార్గెట్ 208.. రెండు వికెట్లు కోల్పోయిన ఎస్ఆర్హెచ్
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ చేధనలో తడబడుతోంది. 6 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 35 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి 21, ఎయిడెన్ మార్ర్కమ్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.
వార్నర్, రోవ్‌మెన్ పావెల్ మెరుపులు.. ఢిల్లీ క్యాపిటల్స్ 207/3
ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు సాధించింది. డేవిడ్ వార్నర్ (58 బంతుల్లో 92*, 12 ఫోర్లు, 3 సిక్సర్లు), రోవ్‌మెన్ పావెల్(35 బంతుల్లో 67*, 3 ఫోర్లు, 6 సిక్సర్లు)విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో భువనేశ్వర్ , శ్రేయాస్ గోపాల్, సీన్ అబాట్ తలా ఒక వికెట్ తీశారు.
వార్నర్, పావెల్ జోరు.. భారీ స్కోరు దిశగా ఢిల్లీ క్యాపిటల్స్
ఎస్ఆర్హెచ్తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు దిశగా పరిగెడుతుంది. వార్నర్ 74, పావెల్ 28 పరుగులతో దాటిగా ఆడుతున్నారు. ప్రస్తుతం 16 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 3 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.
పంత్(26) ఔట్.. మూడో వికెట్ డౌన్
ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మూడో వికెట్ కోల్పోయింది. శ్రేయాస్ గోపాల్ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్లు సహా ఒక ఫోర్ బాదిన పంత్.. ఆ ఓవర్ ఆఖరి బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. వార్నర్ 47, పావెల్ 1 పరుగుతో ఆడుతున్నారు.
వార్నర్ దూకుడు.. ఢిల్లీ క్యాపిటల్స్ 62/2
ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ దూకుడు ప్రదర్శిస్తున్నాడు. 8 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. వార్నర్ 41, పంత్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.
మిచెల్ మార్ష్(10) ఔట్.. రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్
మిచెల్ మార్ష్(10) రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో వికెట్ కోల్పోయింది. సీన్ అబాట్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ 2 వికెట్ల నష్టానికి 37 పరుగులు చేసింది.
సున్నాకే తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్
ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ పరుగుల ఖాతా తెరవకుండానే తొలి వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ ఐదో బంతికి మన్దీప్ సింగ్ పూరన్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ మూడు ఓవర్లలో వికెట్ నష్టానికి 12 పరుగులు చేసింది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఎస్ఆర్హెచ్
ఐపీఎల్ 2022లో గురువారం ఎస్ఆర్హెచ్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఆసక్తికర పోరు మొదలైంది. టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ఎంచుకుంది. కేన్ విలియమ్సన్ సారథ్యంలోని ఎస్ఆర్హెచ్.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చెంది 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.
ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడవ స్థానంలో ఉంది. ఇప్పటి వరకు ఇరుజట్లు ముఖాముఖి 9 సార్లు తలపడగా.. ఎస్ఆర్హెచ్ 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. ఢిల్లీ క్యాపిటల్స్ 4 మ్యాచ్‌ల్లో గెలిపొందింది.
Related News By Category
Related News By Tags
-
పంత్ కెప్టెన్సీలో కోహ్లి
న్యూఢిల్లీ: దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి... ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో రెండు సెంచరీలతో విజృంభి...
-
విరాట్ కోహ్లి వచ్చేశాడు.. కెప్టెన్‌గా రిషభ్ పంత్
దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ-2025కి ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) తమ జట్టును ప్రకటించింది. టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి తొలి రెండు మ్యాచ్‌లకు అందుబాటు...
-
చవక ధరకే బెస్ట్ ప్లేయర్లు.. వేలంలో సూపర్ హిట్!
ఐపీఎల్-2026 మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అనుసరించిన వ్యూహాలపై భారత మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ స్పందించాడు. ఈసారి వేలంపాటలో అందరి కంటే ఢిల్లీ ప్రదర్శన అద్భుతంగా ఉందని ప్రశంసించాడు. ఎక్కు...
-
మరోసారి ఐపీఎల్లో.. సర్ఫరాజ్ స్పందన ఇదే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఎట్టకేలకు తిరిగి అడుగుపెట్టాడు టీమిండియా స్టార్ సర్ఫరాజ్ ఖాన్. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున 2023లో చివరి సారిగా ఐపీఎల్ ఆడిన ఈ ముంబైకర్.. దాదాపు మూడేళ్ల విరామం త...
-
'డేల్ స్టెయిన్ ఆఫ్ బారాముల్లా'.. ఢిల్లీ జట్టులోకి పేస్ సంచలనం
'శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది' అని అంటుంటారు. ఈ మాట సరిగ్గా జమ్మూ కాశ్మీర్ పేస్ సంచలనం ఆకిబ్కి సరిపోతుంది. ఒకప్పుడు ట్రయల్స్ కోసం తన స్నేహితుడి బూట్లు అడిగి తెచ్చుకున్న ఆకిబ్...


