Breadcrumb
Live Updates
IPL 2022: ఆర్సీబీ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ లైవ్ అప్డేట్స్
లక్నో సూపర్ జెయింట్స్‌పై ఆర్సీబీ ఘన విజయం
ఐపీఎల్ 2022లో ఆర్సీబీ అదరగొడుతుంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 18 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. కృనాల్ పాండ్యా 42 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. కేఎల్ రాహుల్ 30, స్టోయినిస్ 24 పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్‌వుడ్ 4, హర్షల్ పటేల్ 2, సిరాజ్, మ్యాక్స్‌వెల్ చెరొక ఒక వికెట్ తీశారు.
ఓటమికి చేరువలో లక్నో సూపర్ జెయింట్స్
ఆర్సీబీతో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమి దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం 7 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసిన లక్నో మ్యాచ్ గెలవాలంటే 10 బంతుల్లో 34 పరుగులు చేయాల్సి ఉంది.
11 ఓవర్లలో లక్నో సూపర్ జెయింట్స్ 88/3
11 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్ జెయింట్స్ 3 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. కృనాల్ పాండ్యా 32, దీపక్ హుడా 9 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు 30 పరుగులు చేసిన కెప్టెన్ కేఎల్ రాహుల్ హర్షల్ పటేల్ బౌలింగ్‌లో కీపర్ కార్తిక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
టార్గెట్ 182.. లక్నో సూపర్ జెయింట్స్ 33/1
182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ రెండో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన మనీష్ పాండే హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో హర్షల్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 5 ఓవర్లో రెండు వికెట్ల నష్టానికి 33 పరుగులు చేసింది. అంతకముందు డికాక్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది.
డుప్లెసిస్ సెంచరీ మిస్.. 20 ఓవర్లలో ఆర్సీబీ 181/6
లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది, కెప్టెన్ డుప్లెసిస్ 96 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మ్యాక్స్‌వెల్ 23, షాబాజ్ అహ్మద్ 26 పరుగులు చేశారు. చివర్లో కార్తిక్ 8 బంతుల్లో 13 నాటౌట్‌గా మిగిలాడు. కాగా నాలుగు పరుగుల తేడాతో డుప్లెసిస్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. లక్నో బౌలర్లలో దుశ్మంత చమీర, జాసన్ హోల్డర్ చెరో రెండు వికెట్లు తీయగా.. కృనాల్ పాండ్యా ఒక వికెట్ తీశాడు.
షాబాజ్ అహ్మద్(25) రనౌట్.. ఆర్సీబీ 140/5
డుప్లెసిస్ పొరపాటు కారణంగా షాబాజ్ అహ్మద్(25) రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. డుప్లెసిస్ 68, దినేశ్ కార్తిక్ 1 పరుగుతో ఆడుతున్నారు.
10 ఓవర్లలో ఆర్సీబీ 87/4
10 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ 4 వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. డుప్లెసిస్ 31, షాబాజ్ అహ్మద్ 12 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు 10 పరుగులు చేసిన సుయాష్ ప్రభుదేశాయ్ కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో హోల్డర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
50 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ
లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీకి సరైన ఆరంభం లభించలేదు. 50 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఉన్నంతసేపు ధాటిగా ఆడిన మ్యాక్స్‌వెల్( 11 బంతుల్లో 23,3 ఫోర్లు, ఒక సిక్సర్) కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో జాసన్ హోల్డర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆర్సీబీ 7 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. డుప్లెసిస్ 20, ప్రభుదేశాయ్ 10 పరుగులతో ఆడుతున్నారు.
కోహ్లి గోల్డెన్ డక్.. రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ
ఆర్సీబీకి లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ దుశ్మంత చమీర తొలి ఓవర్లోనే గట్టిషాక్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ ఐదో బంతికి అనూజ్ రావత్(4)ను ఔట్ చేసి శుభారంభం ఇచ్చాడు. ఆ తర్వాత మరుసటి బంతికే కోహ్లిని గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం 3 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 29 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్ 16, డుప్లెసిస్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో సూపర్ జెయింట్స్
ఐపీఎల్ 2022 సీజన్లో మంగళవారం ఆర్సీబీ, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఆసక్తికర పోరు మొదలైంది. టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్లో ఇప్పటివరకు ఇరుజట్లు చెరో 6 మ్యాచ్‌లు ఆడి నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి సమానంగా ఉన్నాయి.
ఇరు జట్లు పాయింట్ల పరంగా (8) సమంగానే ఉన్నప్పటికీ మెరుగైన రన్‌రేట్ కారణంగా పాయింట్ల పట్టికలో ఆర్సీబీ (4వ స్థానం) కంటే లక్నోనే (3) ముందుంది.
Related News By Category
Related News By Tags
-
'కోచ్‌గా ఉండుంటే కేఎల్ రాహుల్‌ను కచ్చితంగా తిట్టేవాడిని'
ఐపీఎల్ 2022 సీజన్లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ తమ తొలి సీజన్లోనే అదరగొట్టే ప్రదర్శన నమోదు చేసింది. కేఎల్ రాహుల్ కెప్టెన్సీలోని జట్టు లీగ్ దశలో మంచి విజయాలు అందుకొని ఓవరాల్‌గా ...
-
ఐపీఎల్లో కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు.. తొలి ఆటగాడిగా..!
ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. నాలుగు ఐపీఎల్ సీజన్లలో 600 పైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా రాహుల్ నిలిచాడు. ఐపీఎల్-2022లో రాహుల్ 616 పరుగులు సాధిం...
-
IPL 2022: ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజయం వాళ్లదే.. కారణం ఏమిటంటే!
IPL 2022 Eliminator LSG Vs RCB Winner Prediction: ఐపీఎల్-2022లో మరో ఆసక్తికరపోరుకు రంగం సిద్ధమైంది. ఈ సీజన్‌తో క్యాష్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు...
-
IPL 2022: చిత్రంగా లక్నో 5 ఓటములు ఆ 3 జట్ల చేతిలోనే.. మరి ఆర్సీబీని ఓడిస్తుందా?
IPL 2022 Eliminator LSG Vs RCB: ఐపీఎల్-2022 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. క్వాలిఫైయర్-1లో రాజస్తాన్ రాయల్స్‌పై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. మరోవైపు.. టైటిల్ రేసులో నిల...
-
IPL 2022: సెంచరీ మిస్.. అయితేనేం జట్టును గెలిపించాడు!
IPL 2022 RCB Vs LSG- ముంబై: కొత్త కెప్టెన్ నేతృత్వంలో ఐపీఎల్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ (ఆర్సీబీ) ఆట ప్రతీ మ్యాచ్‌కూ పదునెక్కుతోంది. ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ఆర్సీబీ ఐదో విజయంత...