IPL 2022: Kane Williamson New Boyband Video Song Gone Viral | The Hydera-Boogie - Sakshi
Sakshi News home page

IPL 2022: గూస్‌ బంప్స్‌ తెప్పిస్తున్న సన్‌రైజర్స్‌ సాంగ్‌

Apr 24 2022 6:13 PM | Updated on Apr 24 2022 6:50 PM

IPL 2022: Kane Williamson New Boyband Video Song Gone Viral - Sakshi

Kane Williamson New Boyband Video Song: ఐపీఎల్‌ 2022 సీజన్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడి ఆ తర్వాత వరుస విజయాలతో దూసుకుపోతున్న సన్‌రైజర్స్‌.. సీజన్‌లో సగం మ్యాచ్‌లు పూర్తయ్యేసరికి  7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. నిన్న (ఏప్రిల్‌ 24) ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో వీర లెవెల్‌లో రెచ్చిపోయిన ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లు ప్రత్యర్ధిని కేవలం 68 పరుగులకే కుప్పకూల్చి రెట్టించిన ఉత్సాహంతో రెండో దశ మ్యాచ్‌లకు సన్నద్దమవుతున్నారు. ఆరెంజ్‌ ఆర్మీ ఏప్రిల్‌ 27న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో టేబుల్‌ టాపర్‌ గుజరాత్‌ టైటాన్స్‌ను ఢీకొట్టాల్సి ఉంది. 

కాగా, తాజాగా సన్‌రైజర్స్‌ పోస్ట్‌ చేసిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతూ అభిమానులను తెగ ఆ‍కట్టుకుంటుంది. ఈ వీడియోలో సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌, కీలక ప్లేయర్లు మార్క్రమ్‌, అబ్దుల్‌ సమద్, గ్లెన్‌ ఫిలిప్స్ ఓ పాటను స్వయంగా రచించి అద్భుతంగా ఆలపించారు. వి ఆర్‌ సన్‌రైజర్స్‌.. వి ఆర్‌ ఫ్రమ్‌ హైదరాబాద్‌, వి లవ్‌ బిర్యానీ అంటూ సాగే ఈ పాటను విలియమ్సన్‌ గిటార్‌ వాయిస్తూ పాడగా.. మార్క్రమ్‌, అబ్దుల్‌ సమద్, గ్లెన్‌ ఫిలిప్స్ పక్కనే కుర్చొని గొంతు కలిపారు. 


ఆర్సీబీపై సన్‌రైజర్స్‌ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఈ పాట మరోసారి వైరలవుతోంది. ఈ పాటకు సంబంధించిన వీడియోను చూసి ఆరెంజ్‌ ఆర్మీ అభిమానులు తెగ సంబురపడిపోతున్నారు. పాటలో విలియమ్సన్‌ బ్యాండ్‌ ఇన్వాల్వ్‌ అయిన తీరును చూస్తుంటూ గూస్‌ బంప్స్‌ వస్తున్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, ప్రస్తుత సీజన్‌లో రాజస్థాన్‌, లక్నో చేతుల్లో ఓడిన సన్‌రైజర్స్‌.. ఆ తర్వాత వరుసగా చెన్నై, గుజరాత్‌, కేకేఆర్‌, పంజాబ్‌, ఆర్సీబీలను వరుసగా మట్టికరించిన విషయం తెలిసిందే. 
చదవండి: 'కోహ్లి వ‌రుస‌గా రెండు గోల్డెన్ డ‌క్‌లు.. మాకు క‌న్నీళ్లు తెప్పిస్తున్నాయి'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement