ఐపీఎల్‌ 2020: రైనా కీలక నిర్ణయం! | IPL 2020: Suresh Raina Hints To Join With Chennai Super Kings | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ 2020: రైనా కీలక నిర్ణయం!

Sep 2 2020 3:19 PM | Updated on Sep 19 2020 3:45 PM

IPL 2020: Suresh Raina Hints To Join With Chennai Super Kings - Sakshi

వ్యక్తిగత కారణాలతో స్వదేశం వచ్చానని ఫ్రాంచైజీతో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశాడు. తన మేనమామ దారుణ హత్య నేపథ్యంలో హుటాహుటిన ఇంటికి బలయల్దేరానని చెప్పాడు.

చండీగఢ్‌: వ్యక్తిగత కారణాలతో యూఏఈ నుంచి ఆకస్మికంగా భారత్‌కు వచ్చిన సురేశ్‌ రైనా తిరిగి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. పరిస్థితులు సద్దుమణిగాక అతను తిరిగి చెన్నై సూపర్‌కింగ్స్‌కి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు క్రిక్‌బజ్‌తో రైనా చేసిన చాట్‌ ద్వారా తెలుస్తోంది. తన జట్టు చెన్నై సూపర్‌కింగ్స్‌తో కలుస్తానని అతను చాట్‌లో పేర్కొన్నాడు. వ్యక్తిగత కారణాలతో స్వదేశం వచ్చానని ఫ్రాంచైజీతో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశాడు. తన మేనమామ దారుణ హత్య నేపథ్యంలో హుటాహుటిన ఇంటికి బలయల్దేరానని చెప్పాడు. సీఎస్‌కే తనకు కుటుంబం వంటిదని వ్యాఖ్యానించిన రైనా, ధోని బాయ్‌కి అత్యంత ప్రాధాన్యమిస్తానని చెప్పాడు. భారత్‌లో క్వారంటైన్‌ నియమాల్ని పాటిస్తూనే, ప్రాక్టీస్‌ చేస్తున్నానని తెలిపాడు. 

తిరిగి యూఏఈ వెళ్లి జట్టుతో కలుస్తానని అన్నాడు. కాగా, కుటుంబంలో ఎమర్జెన్సీ కారణంగా రైనా స్వదేశం రావడంపై భిన్న రకాల వాదనలు వెలువడిన సంగతి తెలిసిందే. సీఎస్‌కే యజమాని ఎన్‌.శ్రీనివాసన్‌తో పొసగకనే రైనా ఇంటిబాట పట్టాడని కొందరు, కరోనా పరిస్థితులు, ‘బయో సెక్యూర్‌ బబుల్‌’ నిబంధనలు అనుసరించలేక వచ్చాడని మరికొందరు కామెంట్లు చేశారు. అయితే, శ్రీనివాసన్‌ తనకు తండ్రిలాంటివారని, హఠాత్తుగా ఇంటికి రావడంతో ఆయన అలాంటి వ్యాఖ్యలుచేసి ఉండొచ్చని రైనా అన్నారు. కాగా, రైనా ఇంటికి తిరిగొచ్చిన సందర్భంలో ‘సరైన సౌకర్యాలు, కరోనా భయంతో ఎవరైనా ఇంటికొస్తారా? రైనా ఇంటికి వెళ్లడానికి మరో కారణం కూడా ఉండొచ్చు. ఇప్పటికైతే అతను తిరిగి రాకపోవచ్చు. ఇక చెన్నైతో కూడా ఆట ముగిసినట్లే’ అని శ్రీనివాసన్‌ పేర్కొనడంతో చర్చనీయాంశమైంది.
(చదవండి: రైనా ఎగ్జిట్‌కు ప్రధాన కారణం అదేనా?)
(చదవండి: రైనా బంధువులపై దాడి.. సిట్‌ దర్యాప్తుకు ఆదేశం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement