
ఇంగ్లండ్ పర్యటనలో భారత పురుషల, మహిళల జట్ల ప్లేయర్లు బ్రిటన్ కింగ్ చార్లెస్ IIIను కలిశారు. మంగళవారం లండన్‌లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌ను శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని మెన్స్ టీమ్, హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని ఉమెన్స్ టీమ్, హెడ్ కోచ్‌లు గౌతం గంభీర్, ముజుందార్‌లు సందర్శించారు.
ఈ క్రమంలో హృదయపూర్వకంగా స్వాగతం పలికిన చార్లెస్ III.. కాసేపు వారితో ముచ్చటించారు. ప్రతీ ఒక్కరితో కరచాలనం చేస్తూ నవ్వుతూ పలకరించారు. అందరితో కలిసి ఆయన గ్రూపు ఫోటో దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ప్లేయర్లు, కోచింగ్ స్టాప్‌తో పాటు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా సైతం కింగ్‌ను కలిశారు.

చాలా సంతోషంగా ఉంది: గిల్
ఇక బ్రిటన్ కింగ్‌ను కలవడంపై భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ స్పందించాడు. "కింగ్ చార్లెస్‌ను కలవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన మమ్మల్ని ఎంతో అప్యాయతగా పలకరించారు. మేము చాలా విషయాలు ఆయనతో సంభాషించాము. లార్డ్స్ టెస్టులో సిరాజ్ ఔటైన తీరు చాలా దురదృష్టకరమని ఆయన అన్నారు.
మాకు ఈ మ్యాచ్‌లో ఆదృష్టం కలిసిరాలేదని ఆయనకు చెప్పాను" అని గిల్ పేర్కొన్నాడు. కాగా లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో భారత్ 22 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఆఖరి వరకు పోరాడనప్పటికి టీమిండియాకు పరాజయం తప్పలేదు. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు జూలై 23 నుంచి ప్రారంభం కానుంది.
#WATCH | The United Kingdom: King Charles III met the Indian Men's Cricket team at St. James's Palace in London. pic.twitter.com/SjZU0DL6o1
— ANI (@ANI) July 15, 2025