అరుంధతికి ఐసీసీ పురస్కారం | Indian pace bowler Arundhati Reddy has been named the ICC Women Player of the Month 2026 | Sakshi
Sakshi News home page

అరుంధతికి ఐసీసీ పురస్కారం

Mar 24 2026 5:48 AM | Updated on Mar 24 2026 5:48 AM

Indian pace bowler Arundhati Reddy has been named the ICC Women Player of the Month 2026

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌’గా ఎంపికైన హైదరాబాద్‌ క్రికెటర్‌  

దుబాయ్‌: భారత పేస్‌ బౌలర్, హైదరాబాద్‌ అమ్మాయి అరుంధతి రెడ్డి తన కెరీర్‌లో తొలిసారి అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) అవార్డు సాధించింది. 2021లో ఐసీసీ ప్రవేశపెట్టిన ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌’ పురస్కారాన్ని అరుంధతి తొలిసారి సొంతం చేసుకుంది. ఫిబ్రవరి నెలకుగాను అరుంధతికి ఈ గౌరవం దక్కింది. గత నెలలో ఆస్ట్రేలియాలో పర్యటించిన భారత మహిళల జట్టు టి20 సిరీస్‌ను 2–1తో గెలుచుకుంది. తన బౌలింగ్‌ ప్రదర్శనతో అదరగొట్టి ఎనిమిది వికెట్లు పడగొట్టిన అరుంధతి టీమిండియా టి20 సిరీస్‌ నెగ్గడంలో కీలకపాత్ర పోషించింది. తొలి మ్యాచ్‌లో అరుంధతి 22 పరుగులిచ్చి 4 వికెట్లు, రెండో మ్యాచ్‌లో 30 పరుగులిచ్చి 2 వికెట్లు, మూడో మ్యాచ్‌లో 35 పరుగులిచ్చి 2 వికెట్లు నేలకూలి్చంది.

 ‘ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌గా ఎంపిక కావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా. ఆ్రస్టేలియాలో భారత జట్టు విజయానికి గుర్తింపుగా ఈ పురస్కారం దక్కడం నా ఆనందాన్ని రెట్టింపు చేసింది. ఆ్రస్టేలియా గడ్డపై టి20 సిరీస్‌ విజయం ఈ ఏడాది జూలైలో ఇంగ్లండ్‌లో జరిగే టి20 ప్రపంచకప్‌కు ముందు మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది’ అని అరుంధతి వ్యాఖ్యానించింది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (2022–సెపె్టంబర్‌), దీప్తి శర్మ (2023–డిసెంబర్‌), స్మృతి మంధాన (2024–జూన్, 2025–సెప్టెంబర్‌), షఫాలీ వర్మ (2025–నవంబర్‌) తర్వాత ఐసీసీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌’ అవార్డు గెల్చుకున్న భారత ఐదో మహిళా క్రికెటర్‌గా అరుంధతి గుర్తింపు పొందింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement