Trolls On BCCI: కోహ్లి తప్పుకొన్నాక.. పరిస్థితి మరీ ఇంతలా దిగజారిందేంటి? బీసీసీఐపై ట్రోల్స్‌

Ind Vs WI Skipper Dhawan: Fans Troll BCCI On Changing Captains - Sakshi

ఆర్నెళ్లలో ఇంత మంది కెప్టెన్లా: ట్రోల్‌ చేస్తున్న నెటిజన్లు

Team India Captains In 2022 So Far: సఫారీ గడ్డపై దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు విరాట్‌ కోహ్లి... వన్డే సిరీస్‌కు కేఎల్‌ రాహుల్‌... స్వదేశంలో శ్రీలంక, వెస్టిండీస్‌లతో పరిమిత ఓవర్ల సిరీస్‌కు రోహిత్‌ శర్మ.. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు రిషభ్‌ పంత్‌... 

ఐర్లాండ్‌ పర్యటనలో టీ20 సిరీస్‌కు హార్దిక్‌ పాండ్యా.. ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్డ్‌ టెస్టుకు జస్‌ప్రీత్‌ బుమ్రా... ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ నేపథ్యంలో వార్మప్‌ మ్యాచ్‌లకు దినేశ్‌ కార్తిక్‌.. వెస్టిండీస్‌తో వన్డేలకు శిఖర్‌ ధావన్‌..!

ఏంటీ ఈ జాబితా అనుకుంటున్నారా?! 2022 తొలి అర్ధభాగంలో టీమిండియా కెప్టెన్ల పేర్లు! వార్మప్‌ మ్యాచ్‌లను మినహాయిస్తే.. ఈ ఏడాదిలోనే భారత జట్టుకు ఏడుగురు సారథులుగా ఎంపికయ్యారు. విరాట్‌ కోహ్లి టీమిండియా కెప్టెన్సీ నుంచి తప్పుకొన్న తర్వాత పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది.

రోహిత్‌ ఒక్కసారి కూడా!
కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రోహిత్‌ శర్మ ఇంత వరకు విదేశాల్లో ఇంత వరకు ఒక్క సిరీస్‌ కూడా ఆడలేదు. ఇంగ్లండ్‌తో షెడ్యూల్‌ టెస్టు సమయంలో కోవిడ్‌ కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఇక జూలై 7 నుంచి టీ20 సిరీస్‌తో అందుబాటులోకి రానున్నాడు.

ఈ విషయం కాసేపు పక్కన పెడితే.. సుమారు ఆర్నెళ్ల కాలంలోనే ఏడుగురు కెప్టెన్లు కావడం.. కోహ్లి, రోహిత్‌, బుమ్రా తదితరులకు తరచుగా విశ్రాంతినివ్వడం పట్ల టీమిండియా ఫ్యాన్స్‌ విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

బీసీసీఐని ట్రోల్‌ చేస్తున్న నెటిజన్లు!
ఎంత మంది కెప్టెన్లను మారుస్తారురా బాబూ అంటూ ఇప్పటికే భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ)ని ట్రోల్‌ చేస్తున్నారు. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు ధావన్‌ను కెప్టెన్‌గా, జడేజాను వైస్‌ కెప్టెన్‌గా తాజాగా ఎంపిక చేసిన నేపథ్యంలో ట్రోల్స్‌ మరింత ఎక్కువయ్యాయి. 

రండి బాబూ రండి.. టీమిండియా కెప్టెన్సీ తీసుకోండి.. అంటూ పండ్లు అమ్ముతున్నట్లుగా అమ్ముతున్నారు.. ఇదిగో టీమిండియా కెప్టెన్‌ విషయంలో ఇలాంటి దుస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు అంటూ మీమ్స్‌తో రెచ్చిపోతున్నారు నెటిజన్లు!

మరోవైపు.. అసలు భారత క్రికెట్‌ జట్టులో ఏం జరుగుతోంది? హెడ్‌కోచ్‌ ద్రవిడ్‌ సర్‌ ఏం చేస్తున్నారు? కీలక ఆటగాళ్లకు తరచుగా విశ్రాంతి ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటి? ఐపీఎల్‌కు మాత్రం అందరూ అందుబాటులో ఉంటారా? అసలు టీమిండియాకు కెప్టెన్లు ఎందరో చెప్పండి? మీరేం చేస్తున్నారో అర్థమవుతోందా? సింపుల్‌.. భారత క్రికెట్‌ను భ్రష్టు పట్టిస్తున్నారు! అంతే కదా! అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: Rishabh Pant: పంత్‌ను ఆ స్థానంలో బ్యాటింగ్‌కు పంపండి.. అప్పుడే: టీమిండియా మాజీ ఓపెనర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top