Ind Vs Eng T20 Series: Wasim Jaffer Comments On Rishabh Pant Batting Position - Sakshi
Sakshi News home page

Rishabh Pant: పంత్‌ను ఆ స్థానంలో బ్యాటింగ్‌కు పంపండి.. అప్పుడే: టీమిండియా మాజీ ఓపెనర్‌

Jul 6 2022 6:29 PM | Updated on Jul 6 2022 8:14 PM

Ind Vs Eng T20 Series: Wasim Jaffer On Rishabh Pant Ideal Batting Position - Sakshi

టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌(PC: BCCI)

పంత్‌ను ఆ స్థానంలో బ్యాటింగ్‌కు పంపండి.. అప్పుడే: టీమిండియా మాజీ ఓపెనర్‌

India Vs England T20 Series: ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్డ్‌ టెస్టును పరాజయంతో ముగించిన టీమిండియా గురువారం నుంచి టీ20 సిరీస్‌ ఆడనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జూలై 7న ఇరు జట్ల మధ్య సౌతాంప్టన్‌ వేదికగా తొలి మ్యాచ్‌ జరుగనుంది. ఇక ఇప్పటికే కోవిడ్‌ కారణంగా టెస్టు మ్యాచ్‌కు దూరమైన కెప్టెన్‌, ఓపెనర్‌ రోహిత్‌ శర్మ పొట్టి ఫార్మాట్‌ సిరీస్‌కు అందుబాటులోకి రానున్నాడు.

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్‌ వసీం జాఫర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్‌కు జోడీగా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ను ఓపెనింగ్‌కు పంపాలని మేనేజ్‌మెంట్‌కు సూచించాడు. ఓపెనర్‌గా పంత్‌ రాణించగలగడని అభిప్రాయపడ్డాడు.

‘‘ఇంగ్లండ్‌తో సిరీస్‌ నేపథ్యంలో టీమిండియా పెద్దలు.. రిషభ్‌ పంత్‌ను టీ20 మ్యాచ్‌లో ఓపెనర్‌గా పంపే విషయమై ఆలోచించాలి. ఓపెనర్‌గా అతడు సక్సెస్‌ అవుతాడని అనిపిస్తోంది’’ అని వసీం జాఫర్‌ ట్విటర్‌లో పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీకై కూర్పు నేపథ్యంలో పలువురు మాజీ క్రికెటర్లు సలహాలు ఇస్తున్న వేళ వసీం జాఫర్‌ ఈ మేరకు ట్వీట్‌ చేయడం గమనార్హం.

కాగా అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంత వరకు పంత్‌ ఎప్పుడూ ఓపెనర్‌గా బరిలోకి దిగలేదన్న సంగతి తెలిసిందే. సుమారు ఆరుసార్లు మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఇక నాలుగు, ఐదు స్థానాల్లో అతడి సక్సెస్‌ రేటు ఎక్కువ. ఇదిలా ఉంటే దక్షిణాఫ్రికాతో స్వదేశంలో టీ20 సిరీస్‌కు సారథిగా వ్యవహరించిన పంత్‌.. కెప్టెన్‌గా సఫలమైనా, బ్యాటర్‌గా విఫలమైన విషయం విదితమే.

చదవండి: Virat Kohli: ఆరేళ్లలో ఇదే తొలిసారి.. అయినా నీకే ఎందుకిలా? ఇప్పటికైనా కళ్లు తెరువు.. లేదంటే!
Ind Vs WI 2022: విండీస్‌తో సిరీస్‌.. శిఖర్‌ ధావన్‌కు బంపరాఫర్‌.. వన్డే జట్టు కెప్టెన్‌గా.. బీసీసీఐ ప్రకటన
ICC Mens Test Rankings: దుమ్ములేపిన పంత్‌.. ఏకంగా! దిగజారిన కోహ్లి ర్యాంకు.. ఇక బెయిర్‌స్టో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement