
Ind Vs SL 2nd Test: అరుదైన రికార్డు ముంగిట టీమిండియా, రోహిత్ శర్మ! సాధించేనా?
India Vs Sri Lanka Test Series 2022: స్వదేశంలో ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపిస్తూ వరుస విజయాలు సాధిస్తున్న టీమిండియా మరో అరుదైన రికార్డు ముంగిట నిలిచింది. బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరిగే పింక్ బాల్ టెస్టులో విజయం సాధించి సరికొత్త రికార్డు సృష్టించాలనే పట్టుదలతో ఉంది. కాగా రోహిత్ శర్మ భారత కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన తర్వాత భారత జట్టు స్వదేశంలో వరుసగా క్లీన్‌స్వీప్‌లు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే, టీ20 సిరీస్‌లను టీమిండియా 3-0 తేడాతో వైట్‌వాష్ చేసింది. అదే విధంగా శ్రీలంకతో టీ20 సిరీస్‌ను కూడా 3-0 తో క్లీన్‌స్వీప్ చేసింది. ఇక తొలి టెస్టులో లంకను చిత్తుగా ఓడించిన రోహిత్ సేనకు రెండో టెస్టులో కూడా పెద్దగా ప్రతిఘటన ఎదురుకాకపోవచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ విజయం నల్లేరు మీద నడకే అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.
అదే నిజమై బెంగళూరులో టీమిండియా విజయం సాధిస్తే వరుసగా పదకొండో గెలుపు సొంతమవుతుంది. తద్వారా ఈ సిరీస్‌ను కూడా క్లీన్‌స్వీప్ చేస్తే.. రెండు ఫార్మాట్లలో రెండు సిరీస్‌లను వరుసగా క్లీన్‌స్వీప్ చేసిన భారత జట్టుగా రోహిత్ సేన చరిత్రకెక్కుతుంది. భారత క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్‌గా రోహిత్ కూడా రికార్డులకెక్కుతాడు. ఇక శనివారం మధ్యాహ్నం 2 గంటలకు భారత్- శ్రీలంక మధ్య రెండో టెస్టు ఆరంభం కానుంది.
చదవండి: Aaron Finch: లక్కీ ఛాన్స్ కొట్టేసిన ఆసీస్ కెప్టెన్.. ఐపీఎల్లోకి రీఎంట్రీ
How excited are you for the pink-ball Test! 👏 👏
— BCCI (@BCCI) March 12, 2022
LIVE action starts in a few hours! ⏳#TeamIndia | #INDvSL | @Paytm pic.twitter.com/aL7qfakYZU