Ind VS Sa 2nd Test Day 2: ముగిసిన రెండో రోజు ఆట.. 58 పరుగుల లీడ్‌లో టీమిండియా

Ind VS Sa 2nd Wanderers Test: Day 2 Updates And Highlights In Telugu - Sakshi

Ind VS Sa 2nd Test Day 2 Updates 

9: 02 PM: 44 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన టీమిండియాను పుజారా(35), రహానే(11) ఆదుకున్నారు. వీరిద్దరు రెండో రోజు ఆఖరి సెషన్‌లో మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడి, టీమిండియాకు 58 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని అందించారు. టీమిండియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌(8), మయాంక్‌(16) ఔటయ్యారు. జన్సెన్‌, ఒలీవియర్‌ తలో వికెట్‌ పడగొట్టారు. అంతకుముందు శార్ధూల్‌ ఏడు వికెట్లతో ఇరగదీయడంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 229 పరుగులకు ఆలౌట్‌ కాగా, భారత్‌.. తమ తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకు చాపచుట్టేసింది. 

8: 28 PM: కేఎల్‌ రాహుల్‌ అవుటయ్యాడన్న షాక్‌ నుంచి తేరుకోకముందే టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ సైతం 23 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఒలీవియర్‌.. మయాంక్‌ను ఎల్బీడబ్ల్యూ చేశాడు. ఫలితంగా టీమిండియా 44 పరుగులకే ఇద్దరు ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. క్రీజ్లో పుజారా(7), రహానే ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 17 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.

8: 07 PM: దక్షిణాఫ్రికాను 229 పరుగులకే కట్టడి చేసిన ఆనందం టీమిండియాకు ఎంతో సేపు నిలువలేదు. ప్రత్యర్ధి లీడ్‌ను దాటే లోపే భారీ షాక్‌ తగిలింది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (8) జన్సెన్‌ బౌలింగ్‌లో మార్క్రమ్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఫలితంగా టీమిండియా 24 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. మయాంక్‌(16), పుజారా క్రీజ్‌లో ఉన్నారు.  

7: 26 PM: టీమిండియా పేసర్‌ శార్ధూల్ ఠాకూర్(7/61) శివాలెత్తడంతో రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 229 పరుగులకే ఆలౌటైంది. అతనికి షమీ(2/52), బుమ్రా(1/49) తోడవ్వడంతో భారీ ఆధిక్యం సాధిద్దామనుకున్న సఫారీల ఆశలు అడియాశలయ్యాయి. దీంతో దక్షిణాఫ్రికా కేవలం 27 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యానికే పరిమితమైంది. కీగన్‌ పీటర్సన్‌(62), టెంబా బవుమా(51) అర్ధ సెంచరీలతో రాణించడంతో దక్షిణాఫ్రికా ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. అంతకుముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. 

5: 58 PM: దక్షిణాఫ్రికా ఏడో వికెట్‌ కోల్పోయింది. కగిసో రబడను షమీ అవుట్‌ చేశాడు. స్కోరు: 179/7.

5: 49 PM: లార్డ్‌ శార్దూల్‌ ఠాకూర్‌ ప్రొటిస్‌ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఇప్పటికే నాలుగు వికెట్లు పడగొట్టిన అతడు... మరో కీలక వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. తెంబా బవుమాను అవుట్‌ చేసి 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. స్కోరు: 177/6.

05: 42 PM: శార్దూల్‌ మరోసారి అద్భుతం చేశాడు. ఇప్పటికే 3 వికెట్లు తీసిన అతడు.. వెరెనె వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ప్రొటిస్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెరెనె ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. స్కోరు: 162-5.

5: 11 PM: ప్రొటిస్‌ జట్టు ప్రస్తుత స్కోరు: 145/4.

4: 53 PM: దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఆచితూచి ఆడుతున్నారు. కైలీ వెరెనె 14, తెంబా బవుమా 15 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుత స్కోరు: 132/4 

3: 30 PM: టీమిండియా బౌలర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ ప్రొటిస్‌ జట్టును దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాడు. మూడు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఎల్గర్‌, పీటర్సన్‌, వాన్‌ డెర్‌ డసెన్‌ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో లంచ్‌ బ్రేక్‌ సమాయానికి దక్షిణాఫ్రికా నాలుగు వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది.

3: 25 PM:
మూడో వికెట్‌ కోల్పోయిన ప్రొటిస్‌.. స్కోరు 101-3
శార్దూల్‌ ఠాకూర్‌ మరోసారి అద్భుతమైన బంతితో రాణించాడు. కీగన్‌ పీటర్సన్‌ను పెవిలియన్‌కు పంపి రెండో వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. 

3: 06 PM: రెండో వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా
కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్‌ రూపంలో ప్రొటిస్ రెండో వికెట్‌ కోల్పోయింది. శార్దూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

రెండో రోజు ఆటమెదలు పెట్టిన దక్షిణాఫ్రికా నిలకడగా ఆడుతోంది. 28 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టానికి 50 పరుగులు సాధించింది. అయితే బుమ్రా బౌలింగ్‌లో ఎల్గర్‌ అవుటయ్యే ప్రమాదాన్ని తృటిలో తప్పించుకున్నాడు. సాఫ్ట్‌ సిగ్నల్‌ ప్రకారం అంపైర్‌ అవుట్‌ ఇవ్వగా.... థర్డ్‌ అంపైర్‌ మాత్రం నాటౌట్‌గా తేల్చాడు.

1: 48 PM: ప్రొటిస్‌ ప్రస్తుత స్కోరు: 44/1

1: 31 PM: భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతన్న రెండో టెస్ట్‌లో భాగంగా రెండో రోజు ఆట ఆరంభమైంది. ఓవర్‌నైట్‌ స్కోరు 35/1తో ప్రొటిస్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం క్రీజులో ఎల్గర్‌(11), పీటర్సన్‌(14) పరుగులతో ఉన్నారు. కాగా తొలి రోజు ఆటలో భాగంగా మోకాలి నొప్పితో బాధపడిన సిరాజ్‌ తిరిగి భారత జట్టుతో చేరాడు. ఇక అంతకుముందు టీమిండియా 202 పరుగులకు ఆలౌట్‌ అయిన సంగతి తెలిసిందే. రబడ 3, ఒలివర్‌ 3, మార్కో జాన్‌సెన్‌ 4 వికెట్లు తీశాడు.

తుది జట్లు:
భారత్‌:
కేఎల్‌ రాహుల్‌(కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, ఛతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానే, హనుమ విహారి, రిషభ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ షమీ, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌

సౌతాఫ్రికా:
డీన్‌ ఎల్గర్‌(కెప్టెన్‌), ఎయిడెన్‌ మార్కరమ్‌, కీగన్‌ పీటర్సన్‌, రసే వాన్‌ డెర్‌ డసెన్‌, తెంబా బవుమా, కైలీ వెరెనె(వికెట్‌ కీపర్‌), మార్కో జాన్‌సెన్‌, కగిసో రబడ, కేశవ్‌ మహరాజ్‌, డువానే ఒలివర్‌, లుంగి ఎంగిడి.

చదవండి: Rohit Sharma: 5-6 కిలోలు తగ్గాలి రోహిత్‌.. అప్పుడే ఉపశమనం; ఫొటో షేర్‌ చేసిన ధావన్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top