
ఫైల్ ఫోటో
లండన్: భారత్, ఇంగ్లండ్‌ల మధ్య వచ్చే నెలలో జరిగే ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌కు మొత్తం గేట్లెత్తేశారు. దీంతో కిక్కిరిసిన ప్రేక్షకుల సమక్షంలో సంప్రదాయ మ్యాచ్‌లు జరుగుతాయి. స్టేడియం నిండా ప్రేక్షకుల్ని అనుమతించాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిర్ణయించింది. బ్రిటన్ ప్రభుత్వం కోవిడ్ నిబంధనల్ని సడలించడంతో క్రికెట్ స్టేడియం హౌస్‌ఫుల్ అయ్యేందుకు మార్గం సుగమమైంది.
సోమవారం ఇంగ్లండ్ ప్రధాని బోరిస్ జాన్సన్ కరోనా నిబంధనల్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించాడు. భారత్, న్యూజిలాండ్‌ల మధ్య జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌కు పరిమిత సంఖ్యలో 4000 మంది ప్రేక్షకులను అనుమతించారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉన్న భారత ఆటగాళ్లు విరామం తీసుకుంటున్నారు. ఈ నెల 14 నుంచి మళ్లీ జట్టు కడతారు.