టీ20 ప్రపంచకప్‌లో భారత తుది జట్టులో అతడికి చోటు దక్కకపోవచ్చు..

If the World Cup Were To Start Tomorrow you would Not play Bhuvneshwar Kumar in the XI - Sakshi

Aakash Chopra  Comments On Bhuvneshwar Kumar:  ఐపీఎల్ 2021 లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్‌ భువనేశ్వర్ కుమార్  పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో  భువి పేలవ ఫామ్‌పై  భారత మాజీ క్రికెటర్‌ ఆకాష్‌ చోప్రా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు. అతడు ఇదే ఫామ్‌ కొనసాగిస్తే రాబోయే టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా   తుది జట్టులో చోటు దక్కే అవకాశం లేదని  చోప్రా అభిప్రాయపడ్డాడు.

కాగా గురువారం చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యచ్‌లో భువనేశ్వర్ కుమార్ 34 పరుగులు ఇచ్చి, ఒక్క వికెట్‌ కూడా సాధించకుండా తన  నాలుగు ఓవర్ల కోటాను ముగించాడు. చెన్నైకు చివరి రెండు ఓవర్లలో 16 పరుగులు అవసరం కాగా భువనేశ్వర్ తన ఓవర్‌లో 13 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. భువనేశ్వర్ కుమార్ ఫామ్‌ ముఖ్యంగా  టీమిండియాకు చాలా ఆందోళన కలిగించే విషయం అని అతడు తెలిపాడు

"నేను భువనేశ్వర్ కుమార్ ఫామ్ గురించి  ఆందోళన చెందుతున్నాను.  ఒక వేళ రేపు వరల్డ్ కప్ ప్రారంభమవుతుంటే  భువనేశ్వర్ కుమార్‌కు నా తుది జట్టులో  చోటు ఇవ్వను. ఎందుకంటే ప్రస్తుతం అతడి బౌలింగ్‌  ప్రదర్శన దారుణంగా ఉంది.  భువీ తన ఫామ్‌కోసం చాలా  కష్టపడుతున్నాడు.  భారత జట్టులో  బుమ్రా,  భువీ, షమీ  ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు మాత్రమే ఉన్నారు.  బుమ్రాకు తోడుగా భువీను నా రెండవ బౌలర్‌గా ఎంచుకున్నాను. కానీ ఈ సమయంలో అతడు ఇకపై నా రెండవ బౌలర్‌ కాదు.. మూడో బౌలర్‌ అయ్యాడు." అని అతడు పేర్కొన్నాడు. కాగా టీ20 ప్రపంచకప్‌లో  భువీ స్థానంలో  దీపక్‌  చహర్‌ను తీసుకోవాలని పలువురు భారత మాజీ ఆటగాళ్లు సూచిస్తున్నారు.  

చదవండిAshes Series: మిమ్మల్ని ఎవరూ రమ్మని బలవంతం చేయడం లేదు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top