World Cup 2022: భారత క్రికెటర్లకు ఘోర అవమానం.. ఆ జట్టులో ఒక్కరికి కూడా..!

ICC announces team of Women’s World Cup 2022 - Sakshi

భారత మహిళా క్రికెటర్లకు ఘోర అవమానం జరిగింది. మహిళల ప్రపంచకప్‌-2022 అత్యుత్తమ జట్టును ఐసీసీ ప్రకటించింది. అయితే ఐసీసీ ప్రకటించిన జట్టులో ఒక్క భారత క్రికెటర్‌కు  కూడా చోటు దక్కలేదు. కాగా మహిళల ప్రపంచకప్‌-2022లో భారత జట్టు లీగ్‌ దశలోనే ఇంటిముఖం పట్టింది. ఐసీసీ ప్రకటించిన అప్‌స్టాక్స్ మోస్ట్ వాల్యూబుల్ జట్టుకు ఆస్ట్రేలియాకు చెందిన మెగ్ లానింగ్ కెప్టెన్‌గా ఎంపికైంది. ఈ జట్టులో నలుగురు ఆసీస్‌ క్రికెటర్‌లకు చోటు దక్కడం గమనార్హం. ఇక ఈ మెగా టోర్నమెం‍ట్‌లో లానింగ్ 394 పరుగులు చేసింది. ఆమెతో పాటు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అలిస్సా హీలీ, రాచెల్ హేన్స్, బెత్‌ మూనీకు చోటు దక్కింది. 

ఈ జట్టుకు ఓపెనర్లుగా లారా వోల్వార్డ్ట్ (దక్షిణాఫ్రికా), అలిస్సా హీలీ(ఆస్ట్రేలియా)లను ఎంపిక చేసిన ఐసీసీ.. మూడో స్థానం కోసం మెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా), నాలుగో ప్లేస్‌కు రాచెల్ హేన్స్ (ఆస్ట్రేలియా),ఐదో ప్లేస్‌కు నాట్ స్కివర్ (ఇంగ్లండ్), ఆ తరువాత వరుసగా బెత్ మూనీ (ఆస్ట్రేలియా),హేలీ మాథ్యూస్ (వెస్టిండీస్), మారిజానే కాప్ (దక్షిణాఫ్రికా), సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లండ్), షబ్నిమ్ ఇస్మాయిల్ (దక్షిణాఫ్రికా), సల్మా ఖాతున్ (బంగ్లాదేశ్), ఎంచుకుంది. 

ఐసీసీ అప్‌స్టాక్స్ మోస్ట్ వాల్యూబుల్ జట్టు:  అలిస్సా హీలీ (వికెట్‌ కీపర్‌) (ఆస్ట్రేలియా) మెగ్ లానింగ్ (కెప్టెన్) (ఆస్ట్రేలియా), రాచెల్ హేన్స్ (ఆస్ట్రేలియా), నాట్ స్కివర్ (ఇంగ్లండ్), బెత్ మూనీ (ఆస్ట్రేలియా), హేలీ మాథ్యూస్ (వెస్టిండీస్) మారిజానే కాప్ (దక్షిణాఫ్రికా), సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లండ్), షబ్నిమ్ ఇస్మాయిల్ (దక్షిణాఫ్రికా), సల్మా ఖాతున్ (బంగ్లాదేశ్)  చార్లీ డీన్ (ఇంగ్లండ్)

whatsapp channel

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top