Gill-Sara Tendulkar Part-Ways? Youngster Hint Breakup Via Instagram Post - Sakshi
Sakshi News home page

Shumban Gill-Sara Tendulkar: గిల్‌, సారా టెండూల్కర్‌ల లవ్‌స్టోరికి ఎండ్‌కార్డ్‌ పడినట్లేనా?!

Aug 26 2022 7:02 PM | Updated on Aug 26 2022 7:43 PM

Gill-Sara Tendulkar Part-Ways Youngster Hint Breakup Via Instagram Post - Sakshi

Photo Credit: Shumban Gill Instagram

టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్‌, భారత యువ క్రికెటర్ శుబ్‌మన్ గిల్‌ మధ్య ప్రేమాయణం నడుస్తోందని కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై ఎప్పుడూ సారా టెండూల్కర్ కానీ, శుబ్‌మన్ గిల్ కానీ స్పందించింది లేదు... తాజాగా ఈ ఇద్దరికీ బ్రేకప్ అయ్యిందంటూ ఒక వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. అందుకు కారణం గిల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టు అందుకు సంకేతంగా ఉంది. దీంతో వారిద్దరి లవ్‌స్టోరీకి ఎండ్‌కార్డ్‌ పడినట్లేనని ప్రచారం జరగుతోంది. 

కాగా ఇటీవలే వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అదిరిపోయే పర్పామెన్స్ ఇచ్చిన గిల్‌ ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’  అవార్డు గెలిచాడు. అనంతరం జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ అంతర్జాతీయ కెరీర్లో డెబ్యూ సెంచరీ సాధించిన గిల్‌ వరుసగా రెండో ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ ఎగురేసుకుపోయాడు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్‌ కెరీర్‌పై ఫోకస్‌ పెట్టేందుకే సారా టెండూల్కర్‌తో బ్రేకప్‌ చేసుకున్నాడంటూ వార్తలు వస్తున్నాయి.

అందుకు తగ్గట్లే తాజాగా శుబ్‌మన్ గిల్ చేసిన పోస్ట్ కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ''లాయల్ టు మై ఫ్యూచర్. నాట్ మై పాస్ట్'' అంటూ కొటేషన్ జోడించాడు. గతంలో జరిగినపోయిన దానికి తాను బాధ్యుడిగా కానంటూ గిల్ చేసిన పోస్టు సారాను ఉద్దేశించి పెట్టిందేనని క్రికెట్‌ ఫ్యాన్స్‌ అభిప్రాయపడ్డారు. కొన్నేళ్ల కిందట సారా టెండూల్కర్ ఫోటోపై శుబ్‌మన్ గిల్ కామెంట్ చేయడం...శుబ్‌మన్ గిల్ ఫోటోలపై సారా పెట్టిన కామెంట్లతో ఈ ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందనే వార్త... సోషల్ మీడియాలో గుప్పుమని వ్యాపించింది.

అయితే ఈ ఇద్దరూ ఒకటిగా ఎప్పుడూ కనిపించింది లేదు. సారా టెండూల్కర్ కంటే శుబ్‌మన్ గిల్ వయసులో ఏడాది చిన్నవాడు కావడం విశేషం. అయితే ప్రేమకు, పెళ్లికి వయసుతో సంబంధం లేదని సచిన్ టెండూల్కర్ - అంజలి నిరూపించారు. సారా కూడా వారి దారిలో నడుస్తుందని వార్తలు వచ్చాయి. అంతలోనే ఈ ఇద్దరూ అన్‌ఫాలో అవ్వడంతో ‘బ్రేకప్’ వార్త... సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

చదవండి: గోవాలో ఎంజాయ్‌ చేస్తున్న సారా... బ్రేకప్‌ చెప్పేశారా అంటూ నెటిజన్ల ట్రోల్స్‌!

గిల్‌ కీలక నిర్ణయం.. ఇంగ్లండ్‌కు పయనం కానున్న భారత ఓపెనర్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement