ఉబెర్‌ కప్‌నుంచి తప్పుకున్న గాయత్రి – ట్రెసా జోడి | Gayatri and Teresa duo pulls out of Uber Cup | Sakshi
Sakshi News home page

ఉబెర్‌ కప్‌నుంచి తప్పుకున్న గాయత్రి – ట్రెసా జోడి

Apr 18 2026 3:57 AM | Updated on Apr 18 2026 3:57 AM

Gayatri and Teresa duo pulls out of Uber Cup

ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్‌ టీమ్‌ ఈవెంట్‌ ఉబెర్‌ కప్‌లో భారత అవకాశాలకు దెబ్బ పడింది. భారత  డబుల్స్‌ జోడి పుల్లెల గాయత్రి – ట్రెసా జాలీ ఈ టోర్నీనుంచి తప్పుకుంది. ట్రెసా మడమకు గాయం కావడంతో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఆసియా చాంపియన్‌షిప్‌కు బయల్దేరే ముందు ప్రాక్టీస్‌లో తన సహచర ప్లేయర్‌ పాదంపై ట్రెసా కాలు పడటంతో ఆమెకు గాయమైందని భారత డబుల్స్‌ కోచ్‌ బి. సుమీత్‌ రెడ్డి వెల్లడించాడు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న ట్రెసా రీహాబిలిటేషన్‌ తర్వాత కోలుకునే అవకాశం ఉంది. 

గాయత్రి – ట్రెసా స్థానంలో ఉబెర్‌ కప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించేందుకు శ్రుతి మిశ్రా – ప్రియ కొంజెన్‌బమ్‌లను ఎంపిక చేశారు. 2023లో జాతీయ చాంపియన్‌గా నిలిచిన ఈ జోడి 2024లో ఆసియా చాంపియన్‌షిప్‌ గెలిచిన జట్టులో సభ్యులుగా ఉన్నారు. డెన్మార్క్‌లోని హార్సెన్స్‌ వేదికగా ఏప్రిల్‌ 24 నుంచి మే 3 వరకు థామస్, ఉబెర్‌ కప్‌ టోర్నీలు జరుగుతాయి. మరో వైపు ఈ టోర్నీలో సాధన కోసం భారత పురుషుల డబుల్స్‌ జోడి సాతి్వక్‌ సాయిరాజ్‌ – చిరాగ్‌ శెట్టి డెన్మార్క్‌ బయల్దేరుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement