లక్నో ఘన విజయం.. గౌతమ్ గంభీర్ గట్టిగా అరుస్తూ.. సెలబ్రేషన్స్‌ వైరల్‌ | Gautam Gambhirs intense celebration as LSG defeat CSK in a High Scoring thriller | Sakshi
Sakshi News home page

IPL 2022: లక్నో ఘన విజయం.. గౌతమ్ గంభీర్ గట్టిగా అరుస్తూ.. సెలబ్రేషన్స్‌ వైరల్‌

Apr 1 2022 12:09 PM | Updated on Apr 1 2022 1:21 PM

Gautam Gambhirs intense celebration as LSG defeat CSK in a High Scoring thriller - Sakshi

Courtesy: IPL Twitter/bcci

ఐపీఎల్‌-2022లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ బోణీ కొట్టింది. గురువారం చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో లక్నో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో డగౌట్‌లో కూర్చోన్న  లక్నో సూపర్‌ జెయింట్స్‌  మెంటార్ గౌతమ్ గంభీర్ తమ జట్టు మ్యాచ్‌ గెలవగనే తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు. గట్టిగా అరుస్తూ తనదైన శైలిలో విన్నింగ్‌ సెలబ్రేషన్స్‌ జరపుకున్నాడు. తన సహాచరులను పంచ్‌ చేస్తూ సంబరాలు జరుపుకోవడం కనిపించింది.

ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌.. ఊతప్ప (50), శివమ్‌ దూబే (49), మొయిన్‌ అలీ (35) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 210 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. అనంతరం 211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో నాలుగు వికెట్లు కోల్పోయి చేధించింది.  లక్నో బ్యాటర్లలో డికాక్‌ (61) కేఎల్‌ రాహుల్‌ (40) లూయిస్‌(55) పరుగులతో రాణించారు.

చదవండి: IPL 2022: భారీ సిక్సర్‌ బాదిన సీఎస్కే బ్యాటర్‌.. చూస్తే వావ్‌ అనాల్సిందే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement