సారీ... ఈ సీజన్‌ ఆడలేను: డకెట్‌ | England cricketer withdraws from IPL | Sakshi
Sakshi News home page

సారీ... ఈ సీజన్‌ ఆడలేను: డకెట్‌

Mar 25 2026 4:22 AM | Updated on Mar 25 2026 4:22 AM

England cricketer withdraws from IPL

ఐపీఎల్‌ నుంచి వైదొలిగిన ఇంగ్లండ్‌ క్రికెటర్‌

డకెట్‌పై రెండేళ్ల నిషేధం పడే అవకాశం  

లండన్‌: ఇంగ్లండ్‌ ఓపెనర్‌ బెన్‌ డకెట్‌ ఈ సీజన్‌ ఐపీఎల్‌ బరిలోకి దిగడం లేదని చావుకబురు చల్లగా చెప్పాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడాల్సిన అతను చాలా ఆలస్యంగా తన గైర్హాజరు నిర్ణయాన్ని ప్రకటించాడు. ‘ఇది కఠినమైన నిర్ణయం. కానీ తప్పలేదు. అందుకే ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్రాంచైజీకి క్షమాపణలు చెబుతున్నా. వేలంలో నాపై నమ్మకముంచి ఐపీఎల్‌ ఆడే అవకాశమిచి్చన ఫ్రాంచైజీ తరఫున ఆడలేకపోవడం విచారకరం’ అని డకెట్‌ పోస్ట్‌ చేశాడు. దీంతో ఐపీఎల్‌ నియమావళి ప్రకారం అతను రెండేళ్ల నిషేధానికి గురయ్యే అవకాశముంది. 

లీగ్‌ నిబంధన ప్రకారం ఎవరైనా విదేశీ ఆటగాడు వేలంలో పాల్గొని, ఫ్రాంచైజీ ఎంపిక చేసుకున్నాక సహేతుక కారణం లేకుండా ఆడనని చెబితే కుదరదు. గాయం, ఫిట్‌నెస్‌ సమస్యలు, పితృత్వపు సెలవులకు  మినహాయింపు ఉంటుంది. డకెట్‌ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నప్పటికీ తన కుటుంబంతో ఎక్కువసేపు గడిపేందుకు భారత్‌కు రావడం లేదని చెప్పాడు. దీంతో అతనికి నిషేధం తప్పదని ఐపీఎల్‌ వర్గాలు వెల్లడించాయి.  

గాయపడిన ఆటగాళ్ల స్థానాల్లో... 
ఈ సీజన్‌కు ముందు ఫ్రాంచైజీలన్నీ గాయాల బెడదను ఎదుర్కొంటున్నాయి. పలువురు కీలక ఆటగాళ్లు గాయాలతో సీజన్‌ మొత్తానికి దూరమయ్యారు. తాజాగా వారి స్థానాలను ఆయా ఫ్రాంచైజీలు భర్తీ చేసుకున్నాయి.  
» కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు పేసర్‌ ఆకాశ్‌దీప్‌ స్థానంలో రూ. 30 లక్షలతో సౌరభ్‌ దూబేను తీసుకుంది.   
»  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జాక్‌ ఎడ్వర్డ్స్‌ (ఆ్రస్టేలియా) స్థానాన్ని డేవిడ్‌ పైన్‌ (ఇంగ్లండ్‌; రూ.1.5 కోట్లు)తో భర్తీ చేసుకుంది. 
» చెన్నై సూపర్‌ కింగ్స్‌ గాయపడిన నాథన్‌ ఎలీస్‌ స్థానంలో ఆసీస్‌కే చెందిన సహచరుడు స్పెన్సర్‌ జాన్సన్‌ (రూ. 1.5 కోట్లు)ను తీసుకుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement