
జేసన్ రాయ్‌కు భారీ షాకిచ్చిన ఈసీబీ(PC: ECB)
Jason Roy: జేసన్ రాయ్‌కు భారీ షాకిచ్చిన ఈసీబీ.. ఇక
ఇంగ్లండ్ ఓపెనర్ జేసన్ రాయ్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు గట్టి షాకిచ్చింది. అతడికి 2500 పౌండ్ల జరిమానా వేయడంతో పాటు రెండు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడకుండా నిషేధం విధించింది. ఇందుకు సంబంధించి ఈసీబీ తరఫున ది క్రికెట్ డిసిప్లిన్ కమిషన్(సీడీసీ) ప్రకటన విడుదల చేసింది.
ఈ మేరకు.. ‘‘క్రికెట్ ప్రయోజనాలు, ఈసీబీతో పాటు అతడి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా జేసన్ రాయ్ వ్యవహరించాడు. కాబట్టి ఈసీబీ ఆదేశాల్లోని 3.3 రూల్‌ను ఉల్లంఘించినందుకు గానూ అతడిపై చర్యలు తీసుకునేందుకు సీడీసీ నిర్ణయించింది’’ అని పేర్కొంది. అదే విధంగా రాయ్‌కు విధించిన జరిమానాను మార్చి 31లోగా చెల్లించాలని ఆదేశించింది. అయితే, ఇందుకు దారి తీసిన ఘటన లేదంటే కారణాన్ని మాత్రం వెల్లడించకపోవడం గమనార్హం.
కాగా ఇంగ్లిష్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. జేసన్ రాయ్ గతంలో అనుసరించిన వివక్షపూరిత వైఖరి వల్లే చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. ఇక ఐపీఎల్ మెగా వేలం-2022లో భాగంగా కొత్త ఫ్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్ రూ.2 కోట్లకు రాయ్‌ను కొనుగోలు చేసింది. అయితే, గత మూడేళ్లుగా బిజీ షెడ్యూల్ కారణంగా తన కుటుంబానికి దూరమయ్యానని, వారికి సమయం కేటాయించలనుకుంటున్నందు వల్ల టోర్నీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
చదవండి: IPL 2022: ఇకపై అలా కుదరదు.. సింగిల్ తీస్తే కానీ..
IPL 2022. pic.twitter.com/fZ0LofBgSE
— Jason Roy (@JasonRoy20) March 1, 2022