MS Dhoni 41st Birthday: ధోని పుట్టినరోజు వేడుకలు.. హాజరైన పంత్.. వీడియో వైరల్

MS Dhoni 41st Birthday Celebrations Video: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 41వ పుట్టిన రోజు నేడు(జూలై 7). ఈ సందర్భంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేసింది. అదే విధంగా అభిమానులు, సహచర ఆటగాళ్లు, రణ్‌వీర్ సింగ్ తదితర సినీ స్టార్లు కూడా మిస్టర్ కూల్‌కి విషెస్ తెలియజేస్తున్నారు.
An idol & an inspiration 👏 👏
Here's wishing @msdhoni - former #TeamIndia Captain & one of the finest to have ever graced the game - a very happy birthday. 🎂 👍 pic.twitter.com/uxfEoPU4P9
— BCCI (@BCCI) July 7, 2022
ఇదిలా ఉంటే.. ధోని- సాక్షి దంపతుల వివాహ వార్షికోత్సవం జూలై 4న అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సెలబ్రేషన్స్ కోసం ఈ జంట లండన్ వెళ్లింది. దీంతో ధోని పుట్టినరోజును కూడా అక్కడే సెలబ్రేట్ చేసింది ధోని సతీమణి సాక్షి.
ఈ నేపథ్యంలో ధోని కేక్ కట్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన సాక్షి.. ‘‘పుట్టిన రోజు శుభాకాంక్షలు మై లవ్’’ అంటూ క్యాప్షన్ జత చేశారు. ఇక బర్త్‌డే వేడుకకు సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఇందులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ కూడా ఉండటం విశేషం. కాగా టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న నేపథ్యంలో పంత్.. మహీ భాయ్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోని ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే సీజన్‌లోనూ సీఎస్‌కే తరఫున బరిలోకి దిగుతానని తలైవా ఇప్పటికే స్పష్టం చేశాడు.
చదవండి: Virat Kohli: ఆరేళ్లలో ఇదే తొలిసారి.. అయినా నీకే ఎందుకిలా? ఇప్పటికైనా కళ్లు తెరువు.. లేదంటే!
MS Dhoni Knee Problem: మోకాలి నొప్పులతో బాధపడుతున్న ధోని.. ట్రీట్‌మెంట్ ఖర్చు 40 రూపాయలు!
సంబంధిత వార్తలు