సీఎస్‌కేకు మరో భారీ షాక్‌.. విధ్వంసకర వీరుడికి గాయం | CSK suffer another blow before IPL 2026 opener | Sakshi
Sakshi News home page

IPL 2026: సీఎస్‌కేకు మరో భారీ షాక్‌.. విధ్వంసకర వీరుడికి గాయం

Mar 29 2026 8:17 PM | Updated on Mar 30 2026 10:25 AM

CSK suffer another blow before IPL 2026 opener

ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌మ తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ద‌మైంది. సోమ‌వారం గౌహ‌తి వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో సీఎస్‌కే త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌కు ముందు సీఎస్‌కేకు భారీ ఎదురు దెబ్బ త‌గిలింది. దక్షిణాఫ్రికా యువ సంచలనం డెవాల్డ్ బ్రెవిస్ గాయం కార‌ణంగా సీఎస్‌కే ఆడే తొలి మూడు మ్యాచ్‌ల‌కు దూరం కానున్న‌ట్లు తెలుస్తోంది.

రెవ్‌స్పోర్ట్స్ నివేదిక ప్రకారం.. బ్రెవిస్ పక్కటెముకల కండరాల నొప్పి తో బాధపడుతున్నాడు. అత‌డు కోలుకోవ‌డానికి దాదాపు రెండు వారాల స‌మ‌యం ప‌ట్ట‌నున్న‌ట్లు స‌మాచారం. ఐపీఎల్‌-2025 సీజ‌న్ మ‌ధ్య‌లో సీఎస్‌కేతో  బ్రెవిస్  చేరాడు. గ‌త సీజ‌న్‌లో బ్రెవిస్ దుమ్ములేపాడు. కేవలం 6 మ్యాచ్‌ల్లోనే 225 పరుగులు చేసి స‌త్తాచాటాడు. 

ఆ త‌ర్వాత సౌతాఫ్రికా లీగ్ 2025-26లో కూడా అత‌డు త‌న ప‌వ‌ర్ చూపించాడు. ప్రిటోరియా తరఫున 12 మ్యాచ్‌ల్లో 370 పరుగులు చేశాడు. అటువంటి విధ్వంస‌క‌ర ప్లేయ‌ర్ గాయం బారిన ప‌డ‌డం సీఎస్‌కేకు గ‌ట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. మ‌రోవైపు ఎంఎస్ ధోని కూడా కండ‌రాల గాయంతో స‌త‌మ‌త‌వుతున్నాడు. అత‌డు దాదాపు సీఎస్‌కే ఆడే ఆరు మ్యాచ్‌ల‌కు దూర‌మ‌య్యాడు. ఇప్పుడు ఈ జాబితాలో బ్రెవిస్ కూడా చేరాడు. అంత‌కంటే ముందు ఆసీస్ స్పీడ్ స్టార్ నాథ‌న్ ఎల్లీస్ ఏకంగా సీజ‌న్ మొత్తానికే దూర‌మ‌య్యాడు.

ఐపీఎల్‌-2026 సీఎస్‌కే జ‌ట్టు
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), సంజు శాంసన్, ఆయుష్ మాత్రే,  శివమ్ దూబే, ఉర్విల్ పటేల్, నూర్ అహ్మద్, స్పెన్సర్ జాన్సన్, శ్రేయాస్ గోపాల్, ఖలీల్ అహ్మద్, రామకృష్ణ ఘోష్, ఓవర్సీస్, ముకేష్మీ చౌద్ సింగ్, అన్షుల్ కాంబోజ్, అకేల్ హోసేన్, ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ (వికెట్ కీప‌ర్‌), మాథ్యూ షార్ట్, అమన్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్, మాట్ హెన్రీ, రాహుల్ చాహర్, జాక్ ఫౌల్కేస్.
 

Advertisement
 
Advertisement
Advertisement