ఐపీఎల్‌ ప్రారంభానికి ముందు సీఎస్‌కే స్పిన్నర్‌కు భారీ డీల్‌ | CSK Spinner Joins Surrey For 2026 Season | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ ప్రారంభానికి ముందు సీఎస్‌కే స్పిన్నర్‌కు భారీ డీల్‌

Mar 26 2026 8:54 PM | Updated on Mar 27 2026 11:47 AM

CSK Spinner Joins Surrey For 2026 Season

చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరఫున ఐపీఎల్ 2026లో ఆడబోయే స్పిన్నర్ రాహుల్ చహర్, సర్రే కౌంటీ క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఐపీఎల్ 2026లో తన బాధ్యతలు ముగిసిన తర్వాత జూన్ 7 నుంచి కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఆడనున్నారు. ఈ ఒప్పందంలో చాహర్‌ ఎనిమిది మ్యాచ్‌లు ఆడతాడు.

చాహర్‌ 2025లో కూడా సర్రే తరఫున ఆడాడు. అదే అతనికి కౌంటీల్లో అరంగేట్రం సీజన్‌. చాహర్‌ తన తొలి కౌంటీ మ్యాచ్‌లోనే 10 వికెట్లు (రెండో ఇన్నింగ్స్‌లో 8/51తో) తీసి, సర్రే తరఫున అరంగేట్రంలోనే అత్యుత్తమ గణాంకాలు నమెదు చేసిన ఆటగాడిగా 166 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. గతంలో ఈ రికార్డు విలియం మూడీ పేరిట ఉండింది. 1860లో అతను సర్రే తరఫున అరంగేట్రంలో 7/61 సాధించాడు.

ఇదిలా ఉంటే, సీఎస్‌కే ఈ సీజన్‌ మినీ వేలంలో రాహుల్ చహర్‌ను రూ. 5. 20 కోట్లకు కొనుగోలు చేసింది. చాహర్‌ సీఎస్‌కే తరఫున దేశీయ ప్రధాన స్పిన్నర్‌గా బరిలో ఉంటాడు. గతంలో వివిధ ఫ్రాంచైజీలకు ( MI, PBKS, SRH) ఆడిన చాహర్‌ ఐపీఎల్‌ కెరీర్‌లో ఇప్పటివరకు 79 మ్యాచ్‌ల్లో 75 వికెట్లు సాధించాడు. ఈ సీజన్‌ను సీఎస్‌కే మార్చి 30న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌తో ప్రారంభిస్తుంది.

2026 ఐపీఎల్‌ సీజన్‌ కోసం సీఎస్‌కే జట్టు..
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), ఎం.ఎస్. ధోనీ, సంజు సాంసన్, డెవాల్డ్ బ్రెవిస్, అయుష్ మాఠ్రే, కార్తిక్ శర్మ, సర్ఫరాజ్ ఖాన్, ఉర్విల్ పటేల్, జేమీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, ప్రశాంత్ వీర్, మాథ్యూ షార్ట్, అమన్ ఖాన్, జాక్ ఫౌల్క్స్, శివమ్ దూబే, ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, అంషుల్ కాంబోజ్, ముకేశ్ చౌధరి, శ్రేయాస్ గోపాల్, గుర్జప్నీత్ సింగ్, అకీల్ హొసేన్, మ్యాట్ హెన్రీ, రాహుల్ చహర్, స్పెన్సర్ జాన్సన్

Advertisement
 
Advertisement
Advertisement