Christiano Ronaldo: వందో గోల్‌తో కుమారుడికి నివాళి | Cristiano Ronaldo Pays Tribute To Late Son After Goal Against Arsenal | Sakshi
Sakshi News home page

Premier League: వందో గోల్‌తో కుమారుడికి నివాళులర్పించిన క్రిస్టియానో రొనాల్డో

Apr 24 2022 4:59 PM | Updated on Apr 24 2022 5:00 PM

Cristiano Ronaldo Pays Tribute To Late Son After Goal Against Arsenal - Sakshi

లండన్‌: ప్రముఖ ఫుట్‌బాలర్‌, మాంచెస్టర్ యునైటెడ్ స్టార్‌ స్ట్రైకర్ క్రిస్టియానో రొనాల్డో ఇటీవల మరణించిన తన నవజాత శిశువుకు ఘనంగా నివాళులర్పించాడు. ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా శనివారం ఆర్సెనల్‌తో జరిగిన మ్యాచ్‌లో గోల్‌ చేసిన రొనాల్డో.. తన చేతి వేలును ఆకాశం వైపుకు చూపిస్తూ తన బిడ్డను స్మరించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది. రొనాల్డో భాగస్వామి జార్జీనా రోడ్రిగ్వెజ్ ఇటీవల కవలలకు (బాబు, పాప) జన్మనిచ్చింది. అయితే, బాబు పుట్టిన వెంటనే మరణించాడు.  


ఇదిలా ఉంటే, ఆర్సెనల్‌పై చేసిన గోల్‌ రొనాల్డోకు ప్రీమియర్‌ లీగ్‌లో 100వ గోల్‌ కావడం విశేషం. ప్రీమియర్‌ లీగ్‌ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఆటగాడు ఈ ఘనతను సాధించలేదు. ఈ మ్యాచ్‌లో రొనాల్డో గోల్‌ చేసినప్పటికీ మాంచెస్టర్ యునైటెడ్ ఓటమిపాలైంది. ఆర్సినల్‌ 3-1తో గెలుపొందింది. 
చదవండి: టీమిండియాలో చోటుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హార్ధిక్‌ పాండ్యా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement