రొనాల్డొ ఘనత.. 13 ఏళ్ల తర్వాత  | Cristiano Ronaldo Named Premier League Player Of Month September 2021 | Sakshi
Sakshi News home page

Cristiano Ronaldo: రొనాల్డొ ఘనత.. 13 ఏళ్ల తర్వాత 

Oct 8 2021 6:00 PM | Updated on Oct 8 2021 6:08 PM

Cristiano Ronaldo Named Premier League Player Of Month September 2021 - Sakshi

Cristiano Ronaldo Won Premier League Player Of Month Award.. పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డొ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. సెప్టెంబర్‌ నెలకు గాను '' ప్రీమియర్‌ లీగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌'' అవార్డును దక్కించుకున్నాడు. మాంచెస్టర్ సిటీ డిఫెండర్ జోవో క్యాన్సెలో, చెల్సియా ఆంటోనియో రుడిగర్, న్యూకాజిల్‌కు చెందిన అలన్ సెయింట్-మాక్సిమిన్, లివర్‌పూల్ ఫార్వర్డ్ మొహమ్మద్ సలా, వాట్ఫోర్డ్  ఆటగాడు ఇస్మాయిలా సార్‌తో పోటీపడిన రొనాల్డో ఈ అవార్డు సాధించాడు.

 కాగా రొనాల్డొ ఖాతాలో ఇది ఐదో ప్రీమియర్‌ లీగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ కాగా అన్నీ మాంచెస్టర్‌ యునైటెడ్‌ తరపునే గెలవడం విశేషం. జువెంటస్‌ నుంచి మాంచెస్టర్‌ యునైటెడ్‌కు మారాకా రొనాల్డొ ఆరు మ్యాచ్‌ల్లో 5 గోల్స్‌ చేశాడు. ఈ ఐదింటిలో మూడు గోల్స్‌ సెప్టెంబర్‌ నెలలో వచ్చాయి. తన డెబ్యూ మ్యాచ్‌ న్యూ కాసిల్‌తో జరిగిన పోరులో రెండు గోల్స్‌ చేసిన రొనాల్డో ఆ తర్వాత ఓల్‌ గున్నార్‌ టీమ్‌తో జరిగిన పోరులో మరో గోల్‌తో మెరిశాడు.

ఇంతకముందు రొనాల్డో 2006 నవంబర్‌, డిసెంబర్‌ నెలకు గాను.. ఆ తర్వాత 2008 జనవరి, మార్చి నెలకుగానూ రొనాల్డొ మాంచెస్టర్‌ యునైటెడ్‌ తరపున ఈ అవార్డు అందుకున్నాడు. తాజాగా 13 ఏళ్ల గ్యాప్‌ అనంతరం రొనాల్డొ మాంచెస్టర్‌ యునైటెడ్‌ తరపున అవార్డు గెలుచుకోవడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఆర్సెనల్‌ బాస్‌ మైకెల్ ఆర్టెటా సెప్టెంబర్‌ నెలకు గానూ మేనేజర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డును గెలుచుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement