IPL 2021: Chennai Super Kings Vs Kolkata Knight Riders Final Match Today - Sakshi
Sakshi News home page

IPL Final CSK Vs KKR: ఎవరిదో ‘విజయ’ దశమి..?

Published Fri, Oct 15 2021 5:07 AM

Chennai Super Kings vs Kolkata Knight Riders IPL Final Today - Sakshi

పాత చాంపియన్ల మధ్య కొత్త చాంపియన్‌షిప్‌ చివరి పోరుకు రంగం సిద్ధమైంది. ఏకంగా తొమ్మిదిసార్లు ఫైనల్‌ చేరి లీగ్‌కే వన్నె తెచి్చన ఫేవరెట్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ నాలుగో టైటిల్‌పై కన్నేయగా... రెండు సార్లు ఫైనల్‌ చేరితే ఆ రెండుసార్లూ విజేతగా నిలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఈ ఆనవాయితీని కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. మూడో ఐపీఎల్‌ టైటిల్‌తో దుబాయ్‌ నుంచి దిగి్వజయంగా తిరిగి రావాలని ఆశిస్తోంది.

దుబాయ్‌: అవాంతరాలతో ఆగి, భారత్‌నుంచి విదేశం తరలి వెళ్లి మళ్లీ మొదలైన 2021 ఐపీఎల్‌కు ఇంకొన్ని గంటల్లో  దుబాయ్‌లో శుభం కార్డు పడనుంది. 14వ సీజన్‌ ఫైనల్లో అమీతుమీ తేల్చుకునేందుకు మాజీ చాంపియన్లు చెన్నై సూపర్‌ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సై అంటే సై అంటున్నాయి. గత ఏడాది ప్లే ఆఫ్స్‌కే అర్హత సాధించని ఇరు జట్లను కెపె్టన్లు ధోని, మోర్గాన్‌ ఈ సీజన్‌లో సమర్థంగా నడిపించారు. ఇప్పుడు అసలు పోరులో వారి సారథ్యం, బ్యాటింగ్‌ సామర్థ్యం జట్టుకు గెలిపిస్తాయా అనేది ఆసక్తికరం. ధోని నాయకత్వంలోనే చెన్నై మూడు సార్లు చాంపియన్‌గా నిలవగా, ధోనిలాగే వరల్డ్‌ కప గెలిపించిన మోర్గాన్‌ సారథిగా తొలి ఐపీఎల్‌ టైటిల్‌పై కన్నేశాడు.  

అతనే బలం... ‘సూపర్‌’ దళం
బ్యాటింగ్‌ మెరిసినా, మెరిపించకపోయినా ధోని ధోనినే! ఈ క్రికెట్‌ జ్ఞాని శిబిరంలో ఉంటే ఆ జట్టుకు వంద ఏనుగుల బలం. అందుకే భారత క్రికెట్‌ బోర్డు కూడా వచ్చే టి20 ప్రపంచకప్‌ వేటకు వెళ్లే కోహ్లి సేనకు ధోనిని మెంటార్‌గా నియమించింది. తొలి క్వాలిఫయర్‌లో ధోని మెరుపులు జట్టుని గెలుపుతీరానికి చేర్చాయి. ఈ ధనాధన్‌ టి20ల్లో అతని విశేషానుభవం, సారథ్య సామర్థ్యం జట్టుకు అదనపు బలం.

అందుకే 12 సీజన్లు ఐపీఎల్‌ ఆడితే ఏకంగా 9 సార్లు ఫైనల్‌కు చేర్చిన ఘనత ధోనిదే! ఓపెనింగ్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ భీకర ఫామ్‌లో ఉన్నాడు. దీనికి డుప్లెసిస్‌ ధాటి కూడా తోడైతే సూపర్‌ కింగ్స్‌ భారీస్కోరు చేయడం ఖాయమవుతుంది. టాపార్డర్‌ నుంచి దీపక్‌ చహర్‌ దాకా పది మందికి పరుగులు చేసే సత్తా ఉండటం కూడా చెన్నైలో ఆత్మ విశ్వాసాన్ని పెంచుతోంది. దీంతోపాటు ఈ సీజన్‌లో అక్కడా... ఇక్కడా... రెండు సార్లు కోల్‌కతాపై గెలిచిన సానుకాలంశం చెన్నైని మురిపిస్తోంది. ముంబై, అబుదాబీలో జరిగిన భారీ స్కోర్ల మ్యాచ్‌లలో సూపర్‌కింగ్స్‌ జట్టే గెలిచింది.  

టాపార్డర్‌ కీలకం...
మరోవైపు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సీజన్‌ క్లైమాక్స్‌ దశలో రెచి్చపోతోంది. అయితే భారీ స్కోర్లతో, మెరిపించే బ్యాట్స్‌మెన్‌తో కాదు... తిప్పేసే స్పిన్‌ ద్వయంతో పాయింట్ల పట్టికలో తనకన్నా మెరుగైన బెంగళూరు, ఢిల్లీ జట్లను కంగుతినిపించింది. ఇప్పుడు ఫైనల్‌ మజిలీకొచి్చంది. ఇక్కడి దాకా వస్తే టైటిల్‌తోనే వెళ్లిన రికార్డూ ఊరిస్తోంది. సునీల్‌ నరైన్, వరుణ్‌ చక్రవర్తిలు తమ స్పిన్‌ మాయాజాలంతో సూపర్‌కింగ్స్‌ను కట్టిపడేస్తే... లీగ్‌లో ఎదురైన పరాజయాలకు బదులు తీర్చుకోవచ్చు.

అయితే గత రెండు మ్యాచ్‌లు షార్జా పిచ్‌పై జరిగాయి. కానీ ఇది దుబాయ్‌ వికెట్‌. యూఏఈ అంచెలో మెరుగైన స్కోర్లు నమోదైన వేదిక కూడా ఇదే! టాపార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ శుబ్‌మన్‌ గిల్, వెంకటేశ్‌ అయ్యర్, రాహుల్‌ త్రిపాఠిలతో పాటు అనుభవజు్ఞలైన కెపె్టన్‌ మోర్గాన్, దినేశ్‌ కార్తీక్‌లు పరుగుల బాధ్యతను పంచుకోవాలి. చక్కని బ్యాటింగ్‌కు జతగా స్పిన్‌ మ్యాజిక్‌ పనిచేస్తే కోల్‌కతాకు ఫైనల్లో తిరుగుండదు. దుబాయ్‌లో మూడో స్పిన్నర్‌ అవసరం పెద్దగా ఉండకపోవడంతో పాటు రసెల్‌ ఫిట్‌గా ఉంటే షకీబ్‌ స్థానంలో అతనికి చోటు దక్కవచ్చు.

తుది జట్లు (అంచనా)
చెన్నై సూపర్‌కింగ్స్‌: ధోని (కెపె్టన్‌), రుతురాజ్, డుప్లెసిస్, మొయిన్‌ అలీ, ఉతప్ప, రాయుడు, జడేజా, బ్రావో, శార్దుల్, దీపక్‌ చహర్, హాజల్‌వుడ్‌.
కోల్‌కతా నైట్‌రైడర్స్‌: మోర్గాన్‌ (కెపె్టన్‌), గిల్, వెంకటేశ్‌ అయ్యర్, నితీశ్‌ రాణా, రాహుల్‌ త్రిపాఠి, దినేశ్‌ కార్తీక్, షకీబ్‌ / రసెల్, నరైన్, శివమ్‌ మావి, వరుణ్‌ చక్రవర్తి, ఫెర్గూసన్‌.
 

Advertisement
 
Advertisement
 
Advertisement