CSK Vs SRH: చెన్నై అడుగు పడింది...

Chennai Super Kings defeat Sunrisers Hyderabad by 6 wickets - Sakshi

ప్లే ఆఫ్స్‌ చేరిన తొలి జట్టుగా సూపర్‌ కింగ్స్‌

6 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌పై గెలుపు

హైదరాబాద్‌ నిష్క్రమణ

గత ఏడాది పేలవ ఆటతో ‘ప్లే ఆఫ్స్‌’కు దూరం కావడంతో పాటు ఏడో స్థానంతో సరిపెట్టుకున్న మాజీ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఈ సారి సగర్వంగా సత్తా చాటింది. తొమ్మిదో విజయంతో అందరికంటే ముందుగా ముందంజ వేసింది. మరో వైపు తొమ్మిదో ఓటమితో హైదరాబాద్‌ అధికారికంగా ప్లే ఆఫ్స్‌కు దూరమైంది.  

షార్జా: ఒక జట్టుకు తొమ్మిదో విజయం... మరో జట్టుకు తొమ్మిదో పరాజయం... మ్యాచ్‌ ఫలితం ఒక టీమ్‌ను ముందుకు పంపిస్తే మరో టీమ్‌ను నిష్క్ర మించేలా చేసింది. ఈ పోరులో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 6 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై గెలిచింది. హైదరాబాద్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 134 పరుగులు చేసింది. వృద్ధిమాన్‌ సాహా (46 బం తుల్లో 44; 1 ఫోర్, 2 సిక్సర్లు) ఒక్కడే ఫర్వాలేదని పించాడు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జోష్‌ హాజల్‌వు డ్‌ (3/24), బ్రావో (2/17) సన్‌ను కట్టడి చేశారు. చెన్నై 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసి గెలిచింది. రుతురాజ్‌ గైక్వాడ్‌ (38 బంతుల్లో 45; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), డు ప్లెసిస్‌ (36 బంతుల్లో 41; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు.  

సాహా మినహా...
గత మ్యాచ్‌లో గెలుపు రుచి చూసిన హైదరాబాద్‌ జట్టు...మళ్లీ పరాజయాన్ని ఆహా్వనించింది. చెన్నై సీమర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు నిర్లక్ష్యంగా వికెట్లను సమరి్పంచుకుంది. జేసన్‌ రాయ్‌ (2), కెప్టెన్‌ విలియమ్సన్‌ (11), ప్రియమ్‌ గార్గ్‌ (7)... ఇలా కీలక బ్యాటర్స్‌ ప్రత్యర్థి జోరుకు తలవంచారు. ఓపెనర్‌ సాహా ఒక్కడే ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కోగలిగాడు. ఇన్నింగ్స్‌ ఆరంభంలో దీపక్‌ చహర్‌ వేసిన మూడో ఓవర్లో సాహా రెండు భారీ సిక్సర్లతో అదరగొట్టాడు. కానీ ఆ తర్వాత ఇతర బ్యాటర్స్‌ చేతులెత్తేయడంతో తను బాధ్యతతో నింపాదిగా ఆడాడు.

ఓపెనింగ్‌ అదిరింది...
ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్, డుప్లెసిస్‌ చెన్నైకి శుభారంభం ఇచ్చారు. భువీ నాలుగో ఓవర్లో రుతురాజ్, డుప్లెసిస్‌ చెరో సిక్సర్‌ బాదారు. 6.4 ఓవర్లో జట్టు స్కోరు 50 పరుగులకు చేరుకుంది. పది ఓవర్ల దాకా ఎదురేలేకుండా సాగిన ఈ జోడీని హోల్డర్‌ 11వ ఓవర్లో విడగొట్టాడు. రుతురాజ్‌ ఔటవడంతో 75 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యం ముగి సింది. రైనా (2)తో పాటు క్రీజులో పాతుకుపోయిన డుప్లెసిస్‌ను  హోల్డర్‌ ఔట్‌ చేయడంతో కాస్త ఉత్కం ఠ రేపింది. కానీ రాయుడు (17 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌), ధోని (14 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌) మరో వికెట్‌ పడకుండా లక్ష్యాన్ని అందుకున్నారు. ధోని ఆఖరి ఓవర్‌ నాలుగో బంతిని సిక్సర్‌గా బాది మ్యాచ్‌ను ముగించాడు.

స్కోరు వివరాలు
హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: రాయ్‌ (సి) ధోని (బి) హాజల్‌వుడ్‌ 2; సాహా (సి) ధోని (బి) జడేజా 44; విలియమ్సన్‌ (ఎల్బీ) (బి) బ్రావో 11; గార్గ్‌  (సి) ధోని (బి) బ్రావో 7; అభిషేక్‌ (సి) డుప్లెసిస్‌ (బి) హాజల్‌వుడ్‌ 18; సమద్‌ (సి) అలీ (బి) హాజల్‌వుడ్‌ 18; హోల్డర్‌ (సి) చహర్‌ (బి) శార్దుల్‌ 5; రషీద్‌ ఖాన్‌ (నాటౌట్‌) 17; భువనేశ్వర్‌ (నాటౌ ట్‌) 2; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 134.
వికెట్ల పతనం : 1–23, 2–43, 3–66, 4–74, 5–109, 6–110, 7–117.
బౌలింగ్‌: దీపక్‌ 4–0–32–0, హాజల్‌వుడ్‌ 4–0–24–3, శార్దుల్‌ 4–0–37–1; బ్రావో 4–0– 17–2, జడేజా 3–0–14–1, అలీ 1–0–5–0. 

చెన్నై ఇన్నింగ్స్‌: రుతురాజ్‌ (సి) విలియమ్సన్‌ (బి) హోల్డర్‌ 45, డుప్లెసిస్‌ (సి) సిద్ధార్థ్‌ (బి) హోల్డర్‌ 41; అలీ (బి) రషీద్‌ఖాన్‌ 17; రైనా (ఎల్బీ) (బి) హోల్డర్‌ 2; రాయుడు (నాటౌట్‌) 17;  ధోని (నాటౌట్‌) 14; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (19.4 ఓవర్లలో 4 వికెట్లకు) 139. 
వికెట్ల పతనం: 1–75, 2–103, 3–107, 4–108. 
బౌలింగ్‌: సందీప్‌ 3–0–18–0, భువనేశ్వర్‌ 4–0–34–0, హోల్డర్‌ 4–0–27–3, రషీద్‌ 4–0–27–1, సిద్ధార్థ్‌ కౌల్‌ 2.4–0–24–0, అభిõÙక్‌ శర్మ 2–0–9–0.  
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top