వ్రితి అగర్వాల్‌కు కాంస్యం  | Sakshi
Sakshi News home page

వ్రితి అగర్వాల్‌కు కాంస్యం 

Published Mon, Oct 30 2023 1:24 AM

Bronze for Vriti Agarwal - Sakshi

పనాజీ: జాతీయ క్రీడల్లో తెలంగాణకు ఎనిమిదో పతకం లభించింది. ఆదివారం జరిగిన మహిళల స్విమ్మింగ్‌ 200 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో తెలంగాణ అమ్మాయి వ్రితి అగర్వాల్‌ కాంస్య పతకం గెలిచింది. వ్రితి 200 మీటర్ల దూరాన్ని 2ని:09.42 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది.

ప్రస్తుతం తెలంగాణ ఎనిమిది పతకాలతో 20వ ర్యాంక్‌లో ఉంది.  పురుషుల టేబుల్‌ టెన్నిస్‌ టీమ్‌ ఈవెంట్‌లో తెలంగాణ జట్టు 2–3తో ఢిల్లీ జట్టు చేతిలో ఓడిపోయింది. అథ్లెటిక్స్‌ 100 మీటర్ల విభాగంలో ఎలాకియాదాసన్‌ (తమిళనాడు), స్నేహ (కర్ణాటక) చాంపియన్స్‌గా అవతరించారు. 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement