ఏడేళ్ల తర్వాత దిగ్గజ ప్లేయర్‌కు పిలుపు | Bangladesh ODI Squad For Sri Lanka Announced, Tamim Iqbal Brings Back Legend After 7 Years | Sakshi
Sakshi News home page

ఏడేళ్ల తర్వాత దిగ్గజ ప్లేయర్‌కు పిలుపు

Apr 13 2026 2:06 PM | Updated on Apr 13 2026 2:20 PM

Bangladesh ODI Squad For Sri Lanka Announced, Tamim Iqbal Brings Back Legend After 7 Years

తమీమ్‌ ఇక్బాల్‌ బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. మొదటి సంతకమే ఆటగాళ్ల జీతాల పెంపు ఫైల్‌పై చేసిన అతను.. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 

షర్మిన్‌ సుల్తానా అనే ప్లేయర్‌ను ఏడేళ్ల తర్వాత జట్టులోకి వచ్చేలా చేశాడు. షర్మిన్‌ చివరిగా 2019లో బంగ్లాదేశ్‌కు ప్రాతినిథ్యం వహించింది. ఆమె ఇటీవల ఎమర్జింగ్‌ ఏసియా కప్‌లో రాణించి సెలెక్టర్ల దృష్టిని ఆకర్శించింది. షర్మిన్‌ గతంలో బంగ్లాదేశ్‌ తరఫున 13 వన్డేలు ఆడి కేవలం​ 115 పరుగులు మాత్రమే చేయగలిగింది. త్వరలో శ్రీలంకతో జరుగనున్న వన్డే సిరీస్ కోసం షర్మిన్‌ బంగ్లా జట్టుకు ఎంపికైంది.

తమీమ్‌ అథ్వర్యంలోని బంగ్లా సెలెక్టర్లు శ్రీలంకతో వన్డే సిరీస్‌కు ఇవాళ జట్టును ప్రకటించారు. ఈ జట్టులో షర్మిన్‌తో పాటు మరిన్ని ఆసక్తికర ఎంపికలు జరిగాయి. వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ జువైరియా ఫిర్దౌస్‌ జట్టులో చోటు దక్కించుకుంది. అయితే కెప్టెన్‌ నిగార్‌ సుల్తానా వికెట్‌కీపింగ్‌ బాధ్యతలు నిర్వర్తిస్తుండటంతో ఫిర్దౌస్‌ కేవలం బ్యాటర్‌గా మాత్రమే కొనసాగనుంది.

శ్రీలంకతో వన్డే సిరీస్‌ ఏప్రిల్‌ 20 నుంచి జరుగనుంది. ఈ మ్యాచ్‌లు 20, 22, 25 తేదీల్లో రాజ్‌షాహీ మైదానం వేదికగా జరుగనున్నాయి. అనంతరం ఇరు జట్ల మధ్య 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కూడా జరుగనుంది. ఈ సిరీస్‌ ఏప్రిల్‌ 28, 30, మే 2 తేదీల్లో సిల్హెట్‌ వేదికగా జరుగనుంది. టీ20 సిరీస్‌కు బంగ్లా జట్టును ప్రకటించాల్సి ఉంది.

శ్రీలంక సిరీస్ కోసం బంగ్లాదేశ్ వన్డే జట్టు..
నిగర్ సుల్తానా జోటీ (సి), నహిదా అక్టర్ (విసి), ఫర్జానా హక్, శోభనా మోస్తరీ, ఫాహిమా ఖాతున్, షర్మిన్ అక్తర్ సుప్తా, రీతు మోని, షోర్నా అక్టర్, రబెయా ఖాన్, షర్మిన్ సుల్తానా, మరుఫా అక్టర్, ఫరీహా ఇస్లాం త్రిస్నా, సుల్తానా ఖాతున్, శంజిదా అక్తేర్ మగ్లా, జువైరియా ఫిర్దౌస్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement