Tokyo Olympics: ఐసోలేషన్‌లో 63 మంది ఆస్ట్రేలియా అథ్లెట్లు...

Australia Athletics Team Goes Into Isolation American Athlete Tests Covid Positive - Sakshi

టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌ లో కరోనా కలకలం రేపుతుంది. నిర్వహకులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా ఒలింపిక్‌ గ్రామంలో రోజు రోజుకూ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే  కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 193కి చేరింది. యూఎస్ పోల్ వాల్టర్ సామ్ కెండ్రిక్స్‌కి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆస్ట్రేలియన్ పోల్ వాల్టర్ కుర్టిస్ మార్సల్ కేన్డ్రిక్స్‌తో సన్నిహితంగా ఉన్నట్లు తెలిసింది. దీంతో  63 మంది  ఆస్ట్రేలియా ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ల టీమ్ మొత్తం ఐసోలేషన్‌కి వెళ్లింది. వీరందరికీ కరోనా పరీక్షలు నిర్వహించిన తర్వాతే ఒలిపింక్స్‌లో పాల్గొంటారా? లేదా? అనే విషయంపై క్లారిటీ వస్తుంది.

అయితే రెండుసార్లు వరల్డ్ ఛాంపియన్‌ అయిన కెండ్రిక్స్‌, కరోనా బారిన పడడంలో టోక్యో ఒలింపిక్స్ నుంచి తప్పుకున్నాడు. ఒలింపిక్స్ జరుగుతున్న టోక్యోలో గురువారం  కొత్తగా 3,865 కరోనా కేసులు నమోదైయ్యాయి. జూలై 23న మొదలైన ఒలిపింక్స్‌ క్రీడలు ఆగస్టు 8 వరకూ జరగనున్నాయి.
 
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top