ఫ్రెంచ్ ఓపెన్‌లో సబలెంక మూన్‌వాక్‌ | Aryna Sabalenka Overpowers Naomi Osaka To Reach French Open Quarter-Finals | Sakshi
Sakshi News home page

ఫ్రెంచ్ ఓపెన్‌లో సబలెంక మూన్‌వాక్‌

Jun 2 2026 8:53 AM | Updated on Jun 2 2026 10:14 AM

Aryna Sabalenka Overpowers Naomi Osaka To Reach French Open Quarter-Finals

ఫ్రెంచ్ ఓపెన్‌లో ప్రపంచ నంబర్ వన్, బెలారస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెన్నిస్ స్టార్ అరీనా సబలెంక జోరు కొనసాగుతోంది. సబలెంక సోమ‌వారం రాత్రి జ‌రిగిన 4వ రౌండ్‌లో నవోమి ఒసాకా (జపాన్)ను 7-5, 6-3 తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది.

సబలెంకకు వరుసగా ఇది 14వ గ్రాండ్‌స్లామ్ క్వార్టర్ ఫైనల్ కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో సబలెంక అద్భుతమైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచింది. రెండు సెట్లల్లోనూ ఆమె ప్ర‌త్య‌ర్ధికి చుక్క‌లు చూపించింది. ఏకంగా 39 విన్నర్లు, 12 ఏస్‌లతో ముప్పు తిప్ప‌లు పెట్టింది.

కాగా ఈ గేమ్ ముగిసిన అనంత‌రం..మీకు డ్యాన్స్ చేయాల‌న‌నుందా? అని ఓ వ్యాఖ్య‌త స‌బ‌లెంక‌ను అడిగాడు. అందుకు ఆమె అవును అంటూ.. మైఖేల్ జాక్స‌న్ త‌ర‌హాలో మూన్‌వాక్ చేసి అలరించింది. అదేవిధంగా ఈ విజ‌యంపై స‌బలెంక మాట్లడుతూ.. ఈ ఏడాది రోలాండ్ గారోస్ (ఫ్రెంచ్ ఓపెన్)లో ఫలితాలతో సంబంధం లేకుండా కేవలం నా ఆటపైనే నేను దృష్టి పెట్టాను. 

టెన్నిస్‌లో ఏదైనా జరగొచ్చు" అని పేర్కొంది. కాగా యాసెస్ ఓపెన్‌లో నవోమి ఒసాకా చేతిలో స‌బ‌లెంక ఘోర ఓట‌మి చ‌విచూసింది. అయితే ఈ ఏడాది మాత్రం  ఒసాకాపై వరుసగా మూడో విజయాన్ని స‌బ‌లెంక‌ నమోదు చేసింది.



 

 

Advertisement
 
Advertisement
Advertisement