కొమురవెల్లి ఆలయ అభివృద్ధికి కృషి
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంతి కొండా సురేఖ తెలిపారు. బ్రహ్మోత్సవాల నాటికి మేడాలమ్మ, కేతమ్మలకు సుమారు 2 కిలోల బంగారు కిరీటాలు, స్వామి వారి పల్లకీకి వెండి తాపడం చేయిస్తామన్నారు. ఆదివారం స్వామి వారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ మల్లన ఆలయ అభివృద్ధికి త్వరలోనే మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేసేలా చర్యలు చేపడతామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలయాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారన్నారు. గిరిజనుల ఆరాధ్య దైవం సమ్మక్క –సారక్క జాతర ఏర్పాట్లకు ప్రభుత్వం కనివిని ఎరుగని రీతిలో నిధులు మాంజూరు చేసినట్లు తెలిపారు.


