కేసీఆర్‌ను మళ్లీ సీఎంను చేయడమే లక్ష్యం
● ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ● నూతన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లకు సన్మానం
దుబ్బాక: కేసీఆర్‌ను మళ్లీ సీఎంను చేయడమే లక్ష్యంగా కృషి చేద్దామని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం దుబ్బాక పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మొదటి విడత ఎన్నికల్లో గెలుపొందిన నియోజకవర్గంలోని దౌల్తాబాద్, రాయపోల్ మండలాలకు చెందిన బీఆర్‌ఎస్ సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలో లేకున్నా మెజార్టీ సర్పంచ్‌లను బీఆర్‌ఎస్ గెలుచుకోవడం చాలా సంతోషకరమన్నారు. ఇదే స్ఫూర్తితో రెండో విడత ఎన్నికల్లో సైతం పెద్ద ఎత్తున సర్పంచ్‌లను గెలిపించుకుందామన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం అభివృద్ధికి నిధుల కోసం పోరాడుతానన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు ఉన్నారు.


